
India vs New Zealand Result, T20 World Cup 2026: సూర్యసేన సారథ్యంలోని భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచింది. దీంతో భారత జట్టు వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అలాగే, మూడవ సారి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న తొలి జట్టుగా రికార్డులను క్రియోట్ చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. మొత్తంగా ఆ జట్టు నిర్ణీత 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది.
సీఫెర్ట్ 52 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ 17, ఫిన్ అలెన్ 9, రాచిన్ రవీంద్ర 1, గ్లెన్ ఫిలిప్స్ 5, మార్క్ చాప్మన్ 3 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ పడగొట్టారు.
ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. పవర్‌ప్లేలో భారత్ 92 పరుగులు చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగులు చేసింది. సంజు సామ్సన్ 89, ఇషాన్ కిషన్ 54, అభిషేక్ శర్మ 52 పరుగులు చేశారు. చివరగా, శివం దుబే 8 బంతుల్లో 26 పరుగులు చేసి స్కోరును 250 దాటించాడు. న్యూజిలాండ్ తరఫున జిమ్మీ నీషమ్ 3 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..