IND vs NZ : విశ్వవిజేత ఎవరు? టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేళ భారత్-కివీస్ జట్ల బలాబలాలు ఇవే

IND vs NZ : విశ్వవిజేత ఎవరు? టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేళ భారత్-కివీస్ జట్ల బలాబలాలు ఇవే


IND vs NZ : విశ్వవిజేత ఎవరు? టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేళ భారత్-కివీస్ జట్ల బలాబలాలు ఇవే

IND vs NZ : టీ20 ప్రపంచకప్ 2026 తుది పోరుకు రంగం సిద్ధమైంది. మార్చి 8, ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడాలని టీమిండియా పట్టుదలగా ఉండగా, తొలిసారి ఈ ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలవాలని కివీస్ తహతహలాడుతోంది. అయితే ఐసీసీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో తలపడటం భారత్‌కు ఎప్పుడూ ఒక సవాలే. గతాన్ని పరిశీలిస్తే ఫైనల్ పోరులో కివీస్‌దే పైచేయిగా కనిపిస్తోంది.

ఐసీసీ ఫైనల్స్‌లో కివీస్ గండం

ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ జట్లు మూడుసార్లు ఐసీసీ టోర్నీల ఫైనల్లో తలపడ్డాయి. ఇందులో రెండు సార్లు న్యూజిలాండ్ విజయం సాధించగా, భారత్ కేవలం ఒకే ఒక్కసారి గెలిచింది.

1. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ: ఈ మొదటి ఫైనల్లో కివీస్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి కప్పు ఎగరేసుకుపోయింది.

2. 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC): సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఈ చారిత్రాత్మక ఫైనల్లోనూ న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘనవిజయం సాధించింది.

3. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ: ఎట్టకేలకు గత ఏడాది జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి, ఫైనల్స్ ఓటములకు బ్రేక్ వేసింది. ఈ విజయంతోనే భారత్ ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో ఫైనల్ బరిలోకి దిగుతోంది.

మూడు ఫార్మాట్లలో ఫైనల్ ఫైట్ – అరుదైన రికార్డ్

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఈ రెండు జట్లు తలపడటం ద్వారా క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన రికార్డు నమోదైంది. ఐసీసీ నిర్వహించే మూడు ఫార్మాట్ల (టెస్ట్, వన్డే/ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20) ఫైనల్స్‌లో ఒకరినొకరు ఎదుర్కొంటున్న తొలి జట్లుగా భారత్, న్యూజిలాండ్ నిలిచాయి. ఇప్పటికే టెస్ట్, వన్డే ఫార్మాట్ ఫైనల్స్ ఆడేసిన ఈ జట్లు, ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో ఛాంపియన్ ఎవరనేది తేల్చుకోనున్నాయి. ఈ రికార్డ్ ఈ మ్యాచ్ ప్రాముఖ్యతను మరింత పెంచింది.

అహ్మదాబాద్ వేదికగా పాత లెక్కల సర్దుబాటు

అహ్మదాబాద్ స్టేడియంలో లక్షలాది మంది ప్రేక్షకుల మధ్య భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ సేన, గత రికార్డులను పక్కన పెట్టి సరికొత్త చరిత్ర సృష్టించాలని చూస్తోంది. మరోవైపు శాంట్నర్ నేతృత్వంలోని కివీస్ జట్టు తమ నిలకడైన ఆటతీరుతో భారత్‌ను ఇబ్బంది పెట్టాలని స్కెచ్ వేస్తోంది. 2025లో తాము సాధించిన విజయాన్ని మళ్ళీ పునరావృతం చేసి, ఐసీసీ ఫైనల్స్ హెడ్-టు-హెడ్ రికార్డును సమం చేయడమే టీమిండియా ముందున్న అసలైన లక్ష్యం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *