IND vs BAN Match Result: ఆసియా కప్‌లో టీం ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను 41 పరుగుల తేడాతో ఓడించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు 19.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఓపెనర్ సైఫ్ హసన్ 69 పరుగులు చేశాడు. 9 మంది బ్యాటర్స్ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.
అంతకుముందు, టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 38 పరుగులు, శుభ్మాన్ గిల్ 29 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ తరఫున రిషద్ హుస్సేన్ 2 వికెట్లు పడగొట్టగా, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఒక వికెట్ పడగొట్టాడు.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ(కీపర్/కెప్టెన్), మహ్మద్ సైఫుద్దీన్, రిషాద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రాహ్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..