IND vs AUS : భారత మహిళా క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదురైంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇది నిర్ణయాత్మక మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు ఏకంగా 412 పరుగులు చేసి, భారత బౌలర్లపై భారీగా ఆధిపత్యం చెలాయించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో భారత్‌పై ఒక జట్టు 400 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి.
విధ్వంసం సృష్టించిన ఆసీస్ బ్యాటర్లు
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ల ధాటికి భారత బౌలర్లు నిస్సహాయంగా మారారు. ముఖ్యంగా, బేత్ మూనీ తన తుఫాన్ బ్యాటింగ్‌తో కేవలం 138 పరుగులు చేసింది. ఆమెతో పాటు జార్జియా వాల్ (81), ఎలిస్ పెర్రీ (68) కూడా హాఫ్ సెంచరీలు సాధించి జట్టు భారీ స్కోరుకు సహాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఏకంగా 60 ఫోర్లు, 5 సిక్సులు బాదారు. కేవలం బౌండరీల నుంచే వారు 270 పరుగులు రాబట్టారు.
భారత్‌పై ఆస్ట్రేలియా రికార్డు
మహిళల వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ జట్టు కూడా భారత్‌పై 400 పరుగులు చేయలేదు. ఈ రికార్డు కూడా ఆస్ట్రేలియా పేరిటే ఉంది. గతంలో 2024లో భారత్‌పై ఆస్ట్రేలియా 371 పరుగులు చేసింది, ఆ మ్యాచ్‌లో వారు 122 పరుగుల భారీ తేడాతో విజయం సాధించారు. ఇప్పుడు ఆ రికార్డును ఆస్ట్రేలియా జట్టు తానే అధిగమించి, 412 పరుగులు చేసి కొత్త రికార్డు సృష్టించింది. ఇది ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత్‌పై వన్డే క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన టాప్ 4 జట్లలో ఆస్ట్రేలియానే ఉంది.
భారత్‌పై అత్యధిక స్కోర్లు (మహిళల వన్డేలు):
412 పరుగులు – ఆస్ట్రేలియా
371 పరుగులు – ఆస్ట్రేలియా
338 పరుగులు – ఆస్ట్రేలియా
332 పరుగులు – ఆస్ట్రేలియా
321 పరుగులు – సౌత్ ఆఫ్రికా
భారత బౌలర్ల పేలవ ప్రదర్శన
భారత బౌలర్లు ఈ మ్యాచ్‌లో చాలా నిరాశపరిచారు. అరుంధతి రెడ్డి 3 వికెట్లు తీసినప్పటికీ, ఆమె 86 పరుగులు ఇచ్చింది. రేణుక ఠాకూర్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీసుకోగా, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా ఒక్కో వికెట్ పడగొట్టారు. స్నేహ్ రాణా, దీప్తి శర్మ మినహా మిగతా భారత బౌలర్లందరూ ఓవర్‌కు 8కి పైగా ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు. ఈ పేలవ ప్రదర్శన భారత్‌కు పెద్ద సవాలుగా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..