ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇండియన్ ఉమెన్ టీమ్ బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా లేడీ కోహ్లీగా పేరు తెచ్చుకున్న స్మృతి మంధాన అయితే తన విశ్వరూపం చూపిస్తోంది. 413 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో అదే రేంజ్ బ్యాటింగ్ చేస్తూ.. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన మంధాన.. ఆ తర్వాత స్పీడ్ తగ్గించకుండా అదే ఊపులో సెంచరీ కూడా పూర్తి చేసుకుంది.
కేవలం 50 బంతుల్లోనే మంధాన సెంచరీ మార్క్‌ను అందుకొని.. ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేస్తోంది. ప్రస్తుతం 60 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సులతో 120 పరుగులు చేసి దూసుకెళ్తోంది. కాగా వన్డే క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా మంధాన కొత్త చరిత్ర లిఖించింది. మంధాన బ్యాటింగ్ జోరు ముందు ఆసీస్ బౌలర్లు నిలువలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో 412 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ అయింది.
ఆసీస్ బ్యాటర్లలో బెత్ మోనీ సెంచరీతో కదం తొక్కింది. 75 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్స్‌తో 138 పరుగులు చేసి అవుట్ అయింది. కాగా ప్రస్తుతం టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి 206 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 207 పరుగులు కావాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. క్రీజ్‌లో స్మృతి మంధానతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఉంది. వీళ్లిద్దరూ ఎంత సేపు క్రీజ్‌లో ఉంటే.. టీమిండియాకు విజయావకాశాలు అంత పెరుగుతాయి. ఈ టార్గెట్‌ను టీమిండియా ఛేజ్ చేస్తే.. అది చరిత్ర అవుతుంది.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗣𝗟𝗔𝗬𝗘𝗥 🫡🫡
The fastest ODI century ever by a #TeamIndia batter 💯
Congratulations to vice-captain Smriti Mandhana 👏👏
Updates ▶️ https://t.co/Z0OmZGVfVU#INDvAUS | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/lYuDB8L3f0
— BCCI Women (@BCCIWomen) September 20, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి