ICC Events: ఒకదానికిమించి మరొకటి.. 8 భారీ టోర్నమెంట్స్‌కు ప్లాన్ చేసిన ఐసీసీ.. ఇక ఫ్యాన్స్‌కు పండగే..!

ICC Events: ఒకదానికిమించి మరొకటి.. 8 భారీ టోర్నమెంట్స్‌కు ప్లాన్ చేసిన ఐసీసీ.. ఇక ఫ్యాన్స్‌కు పండగే..!


ICC Events: ఒకదానికిమించి మరొకటి.. 8 భారీ టోర్నమెంట్స్‌కు ప్లాన్ చేసిన ఐసీసీ.. ఇక ఫ్యాన్స్‌కు పండగే..!

ICC mega calendar 2031: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) క్రికెట్ అభిమానులకు పెద్ద శుభవార్త అందించింది. 2031 వరకు జరిగే ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు సంబంధించిన మెగా క్యాలెండర్‌ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం వచ్చే ఐదు సంవత్సరాల్లో మొత్తం ఎనిమిది ప్రధాన టోర్నమెంట్‌లు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్‌లలో వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్ కూడా ఉన్నాయి. ఈ కొత్త షెడ్యూల్ వల్ల ప్రతి ఏడాది అభిమానులు ప్రపంచ స్థాయి క్రికెట్‌ను ఆస్వాదించే అవకాశం పొందనున్నారు.

భారత్‌లో జరగనున్న ప్రధాన టోర్నమెంట్‌లు..

క్రికెట్ ప్రపంచంలో సూపర్ పవర్‌గా గుర్తింపు పొందిన భారత్ రాబోయే సంవత్సరాల్లో అనేక పెద్ద టోర్నమెంట్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

2026 టీ20 వరల్డ్ కప్‌ను భారత్ మరియు, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇక 2029లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పూర్తిగా భారత్‌లోనే నిర్వహించబడుతుంది. అదేవిధంగా 2031 వన్డే వరల్డ్ కప్‌ను భారత్, బంగ్లాదేశ్ కలిసి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

దేశీయ పరిస్థితుల ప్రయోజనంతో టీమ్ ఇండియా ఈ టోర్నమెంట్‌లలో టైటిల్ కోసం బలమైన పోటీదారుగా నిలవనుంది.

ఎక్కువమంది చదివినది: ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి ఛోటా ప్యాకెట్..!

చాంపియన్స్ ట్రోఫీ మళ్లీ రంగంలోకి..

ఐసీసీ కొత్త షెడ్యూల్‌లో చాంపియన్స్ ట్రోఫీని మళ్లీ ప్రవేశపెట్టింది. 2025లో ఈ టోర్నమెంట్ పాకిస్థాన్‌లో నిర్వహించబడిందిచిన సంగతి తెలిసిందే. ఇక 2029లో అదే టోర్నమెంట్ భారత్‌లో జరగనుంది.

ఇక 2027 వన్డే వరల్డ్ కప్‌ను ఆఫ్రికా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

2003 తర్వాత మొదటిసారి ఆఫ్రికా ఖండంలో ఇంత పెద్ద ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించబడనుండటం విశేషం.

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్..

టెస్ట్ క్రికెట్ ప్రాధాన్యాన్ని నిలబెట్టేందుకు ఐసీసీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ నిర్వహిస్తోంది.

2027, 2029, 2031 సంవత్సరాల్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఇంగ్లాండ్‌లో నిర్వహించే అవకాశం ఉంది.

ఇక టీ20 వరల్డ్ కప్ కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. 2028 టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో జరుగుతుంది. 2030 టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్‌లో జరగనుంది.

ఎక్కువమంది చదివినది: టీమండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్.. పొట్టి ఫార్మాట్ బాధ్యతలు స్వీకరించేందుకు రెడీ..?

అభిమానులకు ప్రతి ఏడాది వరల్డ్ క్లాస్ క్రికెట్..

ఐసీసీ ప్రకటించిన ఈ భారీ షెడ్యూల్‌తో ఇప్పుడు ప్రతి ఏడాది ప్రపంచ స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లు జరుగుతాయి. దీంతో అభిమానులకు మరింత ఉత్సాహభరితమైన మ్యాచ్‌లు చూడే అవకాశం లభిస్తుంది.

అలాగే కొత్త నిబంధనల ప్రకారం టోర్నమెంట్‌లలో జట్ల సంఖ్య కూడా పెంచడంతో చిన్న దేశాలకు కూడా పెద్ద వేదికపై ఆడే అవకాశం లభించనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *