తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో గురువారం సచివాయలంలోని ఫారెస్టు మినిస్టర్ ఛాంబర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బతుకమ్మ కుంట పునరుద్ఘరణ విషయంలో హైడ్రా చూపిన చొరవను, కమిషనర్ రంగనాథ్‌ను మంత్రి సురేఖ అభినందించారు. బతుకమ్మ కుంట పునరుద్దరించినందుకు శభాష్ అంటూ కితాబు ఇచ్చారు. అయితే, తన పరిధిలో ఉన్న ఎండోమెంటు శాఖలోని భూముల పరిరక్షణకు హైడ్రా సాయం అవసరమని మంత్రి గుర్తు చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్ స్పందింస్తూ.. సీఎం అనుమతితో చర్యలు తీసుకుంటామని మంత్రి సురేఖకు వివరణ ఇచ్చారు.
దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని పరిక్షించేందుకు ఇప్పటికే డీజీపీఎస్ సర్వే చేపడుతున్నట్టు చెప్పారు. అందుకోసం ప్రభుత్వ పరంగా… శాఖ పరంగా కావాల్సిన సాంకేతిక అంశాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. హైడ్రా వచ్చాక చేపట్టిన పనుల వివరాలను రంగనాథ్ మంత్రికి సమగ్రంగా వివరించారు. అయితే, మంచి పనులు చేసే సందర్భంగా కొన్ని ఇబ్బందులు ఎదరవుతాయని, కానీ సామూహిక ప్రయోజనంలో భాగంగా చేశారని మంత్రి సురేఖ కొనియాడారు.
హైడ్రా చేస్తున్న పనులు ప్రయోజనాలు రానున్న కాలంలో ప్రజలందరికీ తెలుస్తాయని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ వరంగల్ నాలాల ఆక్రమణలను కూడా రంగనాథ్‌తో చర్చించారు. వాటిని పరిష్కరించేందుకు తమకు సహకరించాలని అన్నారు. కాగా, బతుకమ్మ కుంట వేడకలకు మంత్రి సురేఖను, రంగనాథ్ ఆహ్వానించారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.