Hyderabad: హైదరాబాద్ ప్రజలకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ప్రయాణం మరింత సులభం!

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ప్రయాణం మరింత సులభం!


Hyderabad: హైదరాబాద్ ప్రజలకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ప్రయాణం మరింత సులభం!

హైదరాబాద్ నగరం చుట్టూ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారీ కోసం సర్వే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో రూల్-377 కింద లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ ఈ మేరకు అధికారిక లేఖ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు.. రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ DPR తయారీకి అవసరమైన సర్వేకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ, రీజినల్ రింగ్ రోడ్డు వెంబడి రైల్వే లైన్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. DPR సిద్ధమైన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇతర భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతారు. అనంతరం నీతి ఆయోగ్ , కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖల ఆమోదం పొందిన తర్వాత ప్రాజెక్టుకు తుది అనుమతులు లభిస్తాయి.

ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి పెద్దపీట పడుతుంది. భువనగిరి నియోజకవర్గంతో పాటుతెలంగాణా ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక చొరవ చూపిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రి తన లేఖలో ధన్యవాదాలు తెలిపారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *