Hyderabad: రోడ్డు దాటుతూ ఒక్కసారిగా కేకలు వేసిన యువతి.. ఏంటా అని చూడగా..

Hyderabad: రోడ్డు దాటుతూ ఒక్కసారిగా కేకలు వేసిన యువతి.. ఏంటా అని చూడగా..


స్మార్ట్‌ఫోన్‌ కమ్యూనికేషన్ సోర్స్ మాత్రమే కాదు ఇప్పుడు స్కిల్ సోర్సుగా మారిపోయింది. అన్ని విషయాలు దాని ద్వారానే తెలుసుకుంటున్నారు. మరోవైపు నేరస్థు సైతం దాన్ని తమ అవసరాలకు వినియోగిస్తున్నారు. దీనిని ఎవరు ఎలా వాడుకుంటారన్నదే వారి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కొంతమంది దీని ద్వారా చదువులు, నైపుణ్యాలు పెంపొందించుకుని జీవితంలో ముందుకు వెళ్తుంటే, మరికొందరు ఇదే సాధనాన్ని తప్పుదారి పట్టడానికి వాడుకుంటారు. ఇదే జరిగింది హైదరాబాద్‌లో. ఓ యువకుడు తన స్మార్ట్‌ఫోన్‌ను నేరాల కోసం ఉపయోగించాలనుకున్నాడు. గూగుల్‌, యూట్యూబ్‌లలో గంటల తరబడి వీడియోలు చూసి చైన్‌ స్నాచింగ్‌ పద్ధతులు నేర్చుకున్నాడు. ఎవరినుంచి సులభంగా దొంగిలించవచ్చు? ఘటనా స్థలంనుంచి ఎలాగు తప్పించుకోవాలి? ఎంత బంగారం, ఎంత డబ్బు వస్తుంది?.. ఇలాంటి విషయాలన్నీ రీసెర్చ్‌ చేశాడు. చివరికి నేర్చుకున్న దాన్ని నిజ జీవితంలో పరీక్షించాలనుకున్నాడు.

మెహదీపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో ఓ యువతి రోడ్డు దాటుతుండగా యాక్షన్‌లోకి దిగాడు. ఆమెను వెనకనుంచి చేరుకున్న నిందితుడు షేక్‌ అలీమ్‌ ఒక్కసారిగా బంగారు గొలుసును లాక్కొని పరుగెత్తాడు. అదే సమయంలో అక్కడే సివిల్‌ డ్రెస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్‌ విక్రం, సిద్ధార్థ ఉన్నారు. యువతి గట్టిగా కేకలు వేయడంతో ఇద్దరూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు. సినిమాలో చూసినట్లు నడిరోడ్డుపై వెంబడించి, చివరికి షేక్‌ అలీమ్‌ను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 15 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ కిషన్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. విచారణలో షేక్‌ అలీమ్‌ చైన్‌ స్నాచింగ్‌ పద్ధతులు, దొంగతనం తర్వాత ఎలా తప్పించుకోవాలో యూట్యూబ్‌ వీడియోలు చూసి ప్రాక్టీస్‌ చేసినట్లు తెలిపారు. తన మొదటి ప్రయత్నంలోనే పట్టుబడ్డాడని ఏసీపీ వివరించారు. ప్రాణాలను పణంగా పెట్టి నిందితుడిని వెంబడించి పట్టుకున్న విక్రం, సిద్ధార్థ సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలను ఏసీపీ ప్రశంసించారు.

Chain Snatcher Held

Chain Snatcher Held



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *