
బంజారాహిల్స్ ఉదయ్ నగర్‌లో నివాసం ఉండే.. శివరాజ్ అనే వ్యక్తి ఈ నెల 16నఫ్యామిలీతో కలిసి నిజామాబాద్ వెళ్లాడు. అయితే ఈ విషయాన్ని శివరాజ్ కుమారుడు తన ఫ్రెండ్ హర్షిత్‌కు ఫోన్ మాట్లాడుతుండగా చెప్పాడు. సీసీ కెమెరా టెక్నీషియన్ అయిన హర్షిత్ లింగంపల్లిలో నివసిస్తున్నాడు. మరుసటి రోజు శివరాజ్ఫ్యామిలీ తిరిగి హైదరాబాద్ వచ్చింది. చూసేసరికి ఇంటి తాళం బ్రేక్ చేసి, అల్మారాలో ఉన్న 6.75 తులాల బంగారు నగలు, రూ.1.10 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ చెక్ చేయగా.. ఒక మహిళ లోపలికి వెళ్లినట్లు, బయటకు వచ్చినట్లు ఉంది. దీంతో ఆ మహిళే దొంగ అనుకున్నారు. అయితే ముందు రోజుల సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేయగా. చోరీకి ఒకరోజు ముందు ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను గమనిస్తున్న ఓ వ్యక్తి కినిపించాడు. అతను హర్షిత్ అని శివరాజ్ కుమారుడు గుర్తించాడు. దీంతో పోలీసులకు సీన్ అర్థమైంది. లింగంపల్లిలోని హర్షిత్ఇంటిలో సోదాలు నిర్వహించి రూ.6.75 తులాల బంగారు ఆభరణాలు, రూ.85 వేల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు హర్షిత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నంచగా.. ఆడ వేషంలో వచ్చి చోరీకి పాల్పడింది తానేనని అంగీకరించాడు. ఆ డబ్బులో రూ.25 వేలు అప్పు తీర్చడానికి వినియోగించినట్లు తెలిపాడు. లోన్యాప్లో అప్పలు చేసి.. ఎలా తీర్చాలో తెలియక దొంగతనం చేసినట్లు పోలీసులకు చెప్పాడు. తన స్నేహితుడు ఊరు వెళ్తున్నాం అని చెప్పగానే చోరీ చేయాలన్న ఆలోచన వచ్చినట్లు పోలీసులు ముందు నిజం ఒప్పుకున్నాడు. నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.