హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు హైటెన్షన్‌కు దారితీశాయి.. దీంతో గాజులరామారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు.. తాము కొనుక్కున్న ఇళ్లను కూల్చవద్దని వేడుకున్నారు. బతుకమ్మ పండుగ వేళ ఇళ్లను కూల్చివేయడంపై ఆవేదన వ్యక్తంచేశారు. జేసీబీలను అడ్డుకుని ధర్నాకు దిగిన గాజులరామారం బాధితులు.. ఇళ్లను అమ్మినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ పండుగ వేళ ఇళ్లను కూల్చివేయడంపై బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. హైడ్రా కూల్చివేతల ప్రాంతంలో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు.
కాగా.. గాజులరామారం ఇళ్ల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. గాజులరామారంలో 317 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రంగనాథ్ తెలిపారు. వందలాది ఎకరాలను ఆక్రమణదారులు కబ్జా చేశారన్నారు. 2014కి ముందు ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం 275 ఎకరాల భూమి ఇచ్చిందని.. భూమి విలువ సుమారు రూ.15 వేల కోట్లు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని.. తెలిపారు.
రాజకీయ నేతలతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని.. భూమిని పేదలకు అమ్మేశారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. పేదల ఇళ్లను కూల్చొద్దని చెప్పాం.. ఖాళీగా ఉన్న ఇళ్లను మాత్రమే కూలుస్తున్నామని తెలిపారు. గాజులరామారంలోని భూములు స్వాధీనం చేసుకుని కంచె వేస్తామని రంగనాథ్ తెలిపారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..