Hyderabad: పండక్కి ఊరెళ్తున్నారా? పోలీసులు చేస్తున్న సూచనలు ఇవే..

Hyderabad: పండక్కి ఊరెళ్తున్నారా? పోలీసులు చేస్తున్న సూచనలు ఇవే..


Hyderabad: పండక్కి ఊరెళ్తున్నారా? పోలీసులు చేస్తున్న సూచనలు ఇవే..

నగరం ఊరెళ్తుంది. అవును.. దసరా సెలవుల రావడంతో.. పండుగను తమ సొంత ఊర్లలో.. కుటుంబ సభ్యుల మధ్య జరపుకునేందుకు జనం పల్లె బాట పట్టారు. అయితే ఇదే అదనుగా తాళం వేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేసే అవకాశం ఉంది. పండుగ సెలవులలో దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు.

  • ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్ల లో భద్రపర్చుకోండి. లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి.
  • సెలవులలో బయటకు వెలుతున్నప్పుడు సెక్యూరిటి అలారం, మోషన్ సెన్సర్ ను ఏర్పాటు చేసుకోవడం మంచిది.
  • మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ గల తాళము అమర్చుకోవడం మంచిది.
  • తాళము వేసి ఊరికి వెళ్లవల్సి వస్తే మీ దగ్గరలోని స్థానిక పోలీసు స్టేషన్ లో సమాచారము ఇవ్వండి.
  •  మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వండి లేదా డయల్ 100 కు ఫోన్ చేయండి.
  • మీ వాహనాలను మీ ఇంటి ఆవరణ లోనే పార్కు చేసుకొండి. మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి. మీకు వీలైతే చక్రాలకు చైన్స్ తో కూడా లాక్ వేయడం మంచిది.
  •  నమ్మకమైన వాచ్ మెన్‌లను మాత్రమే సెక్యూరిటి గార్డులుగా నియమించుకోవాలి.
  • మీ ఇంట్లో అమర్చిన CC Camera లను online లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి.
  • మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్స్ & పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి. వాటిని కూడా గమనించి నేరస్తులు దొంగతనాలకు పాల్పడుతారు.
  •  మెయిన్ డోర్ కి తాళం కప్ప వేసినప్పటికి అవి కనిపించకుండా కర్టెన్స్ తో కవర్ చేయడం మంచిది.
  • బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి లోపల మరియు బయట కొన్ని లైట్లు వేసివుంటే మంచిది.
  •  మీ ఇంటి దగ్గర మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తు ఉండమని చెప్పడం మంచిది.
  • మీ ఇంటికి వచ్చే, వెళ్ళే దారులు.. ఇంటిలోపల సీసీ కెమెరాలు అమర్చు కొని DVR కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశం లో ఉంచండి.
  • అల్మరా, కప్ బోర్డ్స్ కు సంబంధించిన తాళాలు కామన్ ఏరియా అయిన చెప్పుల స్టాండ్, పరుపులు, దిండ్ల క్రింద, అల్మరా పైన, డ్రెస్సింగ్ టేబుల్ లో, కప్ బొర్డ్స్ లో ఉంచకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో ఉంచడం మంచిది.
  • బంగారు ఆభరణాలు వేసుకొని ఫంక్షన్ లకు.. గుడికి వెళ్ళేటప్పుడు తగు జాగ్రతలు తీసుకోండి.
  • సోషల్ మిడియాలో మీరు బయటికి వెళ్ళే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడము మంచిది కాదు.
  • కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి. ఈ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్‌ లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్‌ నెంబర్‌ 9490617444కు సమాచారం ఇవ్వాలి.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *