Hyderabad: ఎయిర్‌పోర్ట్‌లో అదే మాదిరిగా కనిపించిన లేడీ ప్యాసింజర్.. ఆపి లగేజ్ చెక్ చేయగా..

Hyderabad: ఎయిర్‌పోర్ట్‌లో అదే మాదిరిగా కనిపించిన లేడీ ప్యాసింజర్.. ఆపి లగేజ్ చెక్ చేయగా..


శంషాబాద్ విమానాశ్రయంలో మళ్లీ భారీ స్థాయిలో డ్రగ్‌ రవాణా బయటపడింది. శుక్రవారం ఉదయం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఓ మహిళను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇన్టెలిజెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజ్‌ తనిఖీ చేయగా 12 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి బయటపడింది. దీని విలువ సుమారు రూ.12 కోట్లుగా అంచనా వేస్తున్నారు. నిందితురాలు డ్రగ్స్‌ను సూట్‌కేసుల్లో దాచిపెట్టి స్మగ్లింగ్‌ చేయడానికి ప్రయత్నించిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలి పూర్తి డీటేల్స్, డ్రగ్స్‌ ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడి తీసుకెళ్తున్నారు అన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ద్వారా ఇటీవల కాలంలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్ది వారాల క్రితం మరో మహిళ ప్రయాణికురాలు 40.2 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిను రెండు చెక్‌-ఇన్‌ సూట్‌కేసుల్లో దాచిపెట్టి రవాణా చేస్తూ పట్టుబడింది. ఆ డ్రగ్స్‌ విలువ రూ.14 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక ఈ నెల ప్రారంభంలోనే మరో ఘటన చోటుచేసుకుంది. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన 23 ఏళ్ల యువతి వద్ద 13.3 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. దీని అంతర్జాతీయ మార్కెట్‌ విలువ రూ.3 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా డ్రగ్స్‌ రవాణా పెరుగుతున్న నేపథ్యంలో DRI, NCB వంటి విభాగాలు నిరంతరం నిఘా పెంచుతున్నాయని అధికారులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *