Horoscope Today: వీరికి పట్టిన శని వదిలిపోతుంది.. మొండి బాకీలు వసూల్ అవుతాయ్.. మరి మీ రాశి ఎలా ఉందంటే

Horoscope Today: వీరికి పట్టిన శని వదిలిపోతుంది.. మొండి బాకీలు వసూల్ అవుతాయ్.. మరి మీ రాశి ఎలా ఉందంటే


మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు లాభి స్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు ఎక్కువగా వింటారు. డాక్టర్లు, లాయర్లు తదితర రంగాలవారికి సంపాదన పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. బంధుమిత్రులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. పిల్లల చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొం టారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో కొన్ని బరువు బాధ్యతలు మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. రావలసిన డబ్బు, మొండి బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన కొత్త కార్య క్రమాలు చేపడతారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో కలిసి శుభ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.  ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరిం చడం మంచిది. బంధుమిత్రులు కొందరు మిమ్మల్ని ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం హ్యాపీగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతి ఫలం పొందుతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. బాధ్యతలు ఎక్కువవుతాయి. బంధు వులకు సంబంధించిన శుభ కార్యాలలో పాల్గొంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవహార జయానికి, కార్యసిద్ధికి అవకాశం ఉంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టు దలగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

కన్య ( ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా చక్కబెడతారు. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. చేపట్టిన వ్యవహారాలు త్వరితగతిన పూర్తవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచ డానికి ఇది సమయం కాదు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. రోజంతా ఆశించిన విధంగా విజయవంతంగా సాగిపోతుంది. సోదర వర్గంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్య మైన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. సమయానికి చేతికి డబ్బు అంది ఆర్థిక సమస్యలు  పరిష్కారం అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యో న్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. విద్యార్థులకు చాలా బాగుంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపో తారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహా రాలను పూర్తి చేస్తారు. కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో గానీ పూర్తి కావు. అన్న దమ్ములతో స్థిరాస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం ఆనందో త్సాహాలతో సాగిపోతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అధికారులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. వ్యాపార లావాదేవీల్లో సొంత ఆలో చనలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరు ద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు అంది వస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్ప గించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒకటి రెండు సమస్య లు ఉన్నా అవి నిదానంగా సర్దుకుంటాయి. చేపట్టిన ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. సోదరులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కొందరు మిత్రుల వల్ల డబ్బు న‌ష్ట పోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అనుకోని ఖర్చుల్ని భరించాల్సి వస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్సాహంగా పనిచేసి శుభ ఫలితాలను పొందడం జరుగుతుంది. వృత్తి జీవితంలో ఉన్నవారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది.  ఒక శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగి పోతుంది. కొందరు మిత్రులతో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *