Horoscope Today: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (సెప్టెంబర్ 25, 2025): మేష రాశి వారికి ఆర్థిక విషయాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి రోజంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి వారికి కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సమయం చాలావరకు అనుకూలంగా ఉన్నట్టు భావించవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. కొత్త ఆలోచనలు, నిర్ణయాలు, ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలు కలుగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో క్రియాశీలంగా వ్యవహరించి అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రోజంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక విషయాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. అధికారులు ఎంతో నమ్మకంతో బరువు బాధ్యతలు పెంచడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అవసరమైనవారికి వీలైనంతగా సహాయం అందజేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. అనారోగ్యాల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆదాయం కలిసి రావడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉండడం, మనసులోని కోరికలు నెరవేరడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా ఉండదు. అనుకోకుండా ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక సంబంధమైన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభ వార్తలు అందుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు. సమాజంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. మీ సలహాలు, సూచనలకు అధికారులు గౌరవమిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహకారం ఉంటుంది. మిత్రులకు అండగా ఉంటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రోజంతా సాఫీగా, ఉత్సాహంగా గడిచిపోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సాఫీగా సాగిపోతాయి. మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆరోగ్యం, ఆదాయం బాగానే ఉంటాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పురోగతి చెందుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది కానీ విలాసాల మీద ఖర్చు ఎక్కువవుతుంది. దాంపత్య జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. సన్నిహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృథా ఖర్చులు, స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కెరీర్ పరంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సన్నిహితులు కొందరు ఆర్థికంగా మోసగించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితి కాస్తంత అనుకూలంగా ఉంటుంది. ఒకరిద్దరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆదాయం బాగానే పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. కొన్ని శుభ వార్తలు అందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు ఉండవచ్చు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. పిల్లలు వృద్దిలోకి వస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. వృథా ఖర్చుల్ని తగ్గించుకుని అదనపు ఆదాయాన్ని మదుపు చేసుకోవడం మంచిది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృథా ఖర్చులు, స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *