దిన ఫలాలు (సెప్టెంబర్ 27, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగం అనుకూలంగా సాగిపోయే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం లభించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగం అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లలు చదువుల్లో వృద్ధిలోకి వస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి కూడా పెట్టుకోవద్దు. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలుంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మెరుగైన అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం లభిస్తుంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయ వృద్ధికి సమ యం బాగా అనుకూలంగా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. సరైన నిర్ణయాలతో ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను చక్కబెడతారు. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లపై పైచేయి సాధిస్తారు. ప్రతి పనీ ఆశించిన విధంగా పూర్తవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు పరవాలేదనిపిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంతో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. అనుకోకుండా ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరి స్థితి క్రమంగా మెరుగుపడుతుంది. రావలసిన సొమ్మును పట్టుదలగా రాబట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు సానుకూలపడతాయి. మీ మాటకు, చేతకు విలువ బాగా పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు బాగా మెరుగుపడతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అధికారులు మిమ్మల్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటాయి కానీ, కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. ఎదురు చూస్తున్న శుభ వార్తలు వింటారు. ఆస్తి వివాదం సానుకూలపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఏ పని తలపెట్టినా సంతృప్తికరంగా పూర్తవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆశించిన శుభ వార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన ఆఫర్లు అందుతాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో జీతభత్యాలు, ప్రమోషన్లకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆశించిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. గతంలో మీరు సహాయం చేసినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. ఆర్థికపరంగా కొద్దిగా పురోగతి చెందుతారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా తగ్గే అవకాశం ఉంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపా రాలు లాభసాటిగా సాగిపోతాయి. అనుకోకుండా ఆదాయం వృద్ధి చెందుతుంది. కొన్ని అవ సరాలు తీరిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో సానుకూలపడుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి.