Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (సెప్టెంబర్ 30, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాలు బాగా ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కొందరు ఇష్టమైన బంధు మిత్రుల్ని కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వ్యాపారాల్లో కూడా లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో మీ ఆలోచనలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు, వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల అంచనాలకు మించి ప్రయోజనాలు పొందుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది. కీలక బాధ్యతల్ని సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో కూడా లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. తలపెట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల్లో కొందరికి ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు ఊపందుకుంటాయి. ఆరోగ్యం పరవాలేదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి జీవితంలో ఆశించిన దానికంటే ఎక్కువగా డిమాండ్ పెరుగుతుంది. కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలమయ్యే అవకాశం ఉంది. స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయట పడతారు. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తివివాదం పరిష్కారమవుతుంది. ఇంటికి బంధుమిత్రుల రాకలుంటాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి ఒకటి రెండు ధన యోగాలు పడతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను దాటుతాయి. ఆదాయానికి దీటుగా వృథా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ సకాలంలో బాధ్యతలను నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు రాబడి పరంగా సజావుగా, సాఫీగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల నుంచి అవసరమైన సహాయ సహకారాలుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. బంధువుల రాకపోకలుంటాయి. సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనవసర కోపతాపాలతో కుటుంబంలో ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి గౌరవాభిమానాలు లభిస్తాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగిపోతుంది. నిరుద్యోగులు ఆఫర్లు అందుకుంటారు. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను ఒక ప్రణాళిక ప్రకారం చక్కబెడతారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి జీవితం అంచనాలకు మించి ఎదుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలకు అవకాశమిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. తలపెట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెడతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభించకపోవచ్చు. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అశ్రద్ధ తగదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యుల తోడ్పాటును తీసుకోవడం అవసరం. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయటా కొద్దిగా ఒత్తిడి తప్పకపోవచ్చు. ఇష్టమైన బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం హుషారుగా, సరదాగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *