చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే హోలి వేళ.. మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టాలంటే ముందుగా ప్రతికూల శక్తిని తరిమికొట్టాలి. చిరిగిన దుస్తుల నుండి పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు.. మనం ఏమరపాటుగా ఇంట్లో ఉంచుకునే కొన్ని వస్తువులు శని, రాహువుల ప్రతికూల ప్రభావానికి కారణమవుతాయి. మీ పురోగతికి ఆటంకం కలిగించే ఆ 6 వస్తువులు ఏమిటి? వాటిని ఎందుకు తొలగించాలి? అనే పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
1. చిరిగిన పాత బట్టలు (శని ప్రభావం)
చిరిగిన బట్టలు ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది ఆర్థిక ఇబ్బందులకు, అనారోగ్యానికి దారితీస్తుంది. వీటిని వెంటనే తొలగించి అవసరమైన వారికి దానం చేయడం లేదా పారవేయడం వల్ల ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తాయి.
2. పగిలిన గాజు, అద్దాలు
పగిలిన అద్దాలు సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. ఇవి ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తాయి. హోలికా దహన్ కు ముందే వీటిని తీసివేసి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి.
3. వాడిపోయిన మొక్కలు
ఇంట్లో మొక్కలు స్తబ్దతకు చిహ్నం కాకూడదు. వాడిపోయిన లేదా చనిపోయిన మొక్కలు నెగటివ్ వైబ్స్‌ను తెస్తాయి. వాటిని తీసివేసి, కొత్తగా తులసి లేదా మనీ ప్లాంట్‌ను తీసుకురావడం వల్ల ఇంట్లోకి సానుకూలత వస్తుంది.
4. చిరిగిన చెప్పులు, బూట్లు
పాత, చిరిగిన బూట్లు శని గ్రహం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇవి పేదరికాన్ని మరియు పురోగతిలో ఆటంకాలను కలిగిస్తాయి. అందుకే వీటిని ఇంట్లో అస్సలు ఉంచకూడదు.
5. పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువుల (రాహు దోషం)
చెడిపోయిన మొబైల్ ఫోన్లు, టీవీలు లేదా వంటగది గ్యాడ్జెట్లు రాహువును ప్రభావితం చేస్తాయి. ఇవి మీ ఆర్థిక జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. హోలీకి ముందే వీటిని రిపేర్ చేయించడం లేదా సాగనంపడం శ్రేయస్కరం.
6. విరిగిన విగ్రహాలు
పూజా గదిలో విరిగిన దేవుడి విగ్రహాలు ఉండటం అశుభం. వాటిని గౌరవంగా నీటిలో నిమజ్జనం చేయడం లేదా ఇసుకలో పాతిపెట్టడం చేయాలి కానీ, ఎక్కడపడితే అక్కడ పారవేయకూడదు.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. వాస్తు మరియు జ్యోతిష్య ఫలితాలు వ్యక్తిగత నమ్మకాలు గృహ స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి.