హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరం అంతటా ముసురు పట్టిన వాతావరణం నెలకొందని, ఆరు జోన్లకు ఎల్లో అలర్ట్ జారీ చేసిందని ప్రకటించింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అప్రమత్తం చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఈ వర్షాల ప్రభావంతో శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టేక్ ఆఫ్, ల్యాండింగ్లలో ఇబ్బందుల వల్ల కొన్ని విమానాలను విజయవాడకు మళ్లించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ, జీహెచ్ఎంసీ హెచ్చరించాయి. ట్రాఫిక్ జామ్లను నివారించడానికి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని పోలీసులు సూచించారు. జీహెచ్ఎంసీ, హైట్రా సహా ఇతర కీలక శాఖలు అప్రమత్తంగా ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఘట్ కేసర్ లో ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ ఆపి తనిఖీలు చేస్తున్న పోలీసులు
కర్నూలు జిల్లాలో మరింత పతనమైన టమాటా ధర
ములుగు జిల్లాలో ఉధృతంగా బొగత జలపాతం
శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. 5కి.మీ మేర ట్రాఫిక్ జామ్
తెలంగాణ సర్కార్ చేతికి హైదరాబాద్ మెట్రో