
40 ఏళ్లు నిండటం జీవితంలో ఒక కొత్త దశను సూచిస్తుంది. కుటుంబం, పని, బాధ్యతల మధ్య, మహిళలు తరచుగా తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మర్చిపోతారు. కానీ నిజం ఏమిటంటే, ఈ వయస్సులో వాకిరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఈ దశలో మహిళలు తమ గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా చూసుకోవాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. 40 ఏళ్ల వయసులోనూ మహిళలు తమ రోజువారీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. ఆ అలవాట్లు ఎంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.
40 ఏళ్ల వయసులో మీ గుండెను జాగ్రత్తగా చూసుకోవడం ఎందుకు ముఖ్యం?
45 ఏళ్లు పైబడిన దాదాపు సగం మంది మహిళలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని ఈ సమస్యలను తేలికగా తీసుకుంటారని, ఇది దీర్ఘకాలంలో వారి గుండెకు తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. కాబట్టి, మీరు మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, మీరు ఈ కొన్ని విషయాలను మీ దినచర్యలో చేర్చుకోవాలి.
మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 5 సులభమైన మార్గాలు
ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం
- మీ రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి.
- మీ గుండె ఆరోగ్యం గురించి మీ వైద్యుడితో మాట్లాడండి.
రోజూ వ్యాయామం, లేదా యోగా చేయడం
- రోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా, పరుగు లేదా సైక్లింగ్ చేయండి.
- లిఫ్ట్‌లో వెళ్లడం మానేసి మెట్లపై నడవడం అలవాటు చేసుకోండి.
సమతుల్య ఆహారం తీసుకోండి
- మీ రోజువారీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు చేర్చండి.
- ప్యాక్ చేసిన, నూనెతో కూడిన స్నాక్స్ తినడం ఆపేయండి.
వర్క్ ప్రెజర్, నిద్రపై శ్రద్ధ వహించండి
- రోజూ ధ్యానం లేదా లోతైన శ్వాస సాధన చేయండి.
- రోజూ 7–8 గంటలు నిద్రపోండి తప్పకుండా నిద్రపోండి
- ఒత్తిడి, నిద్ర లేకపోవడం రెండూ గుండెకు హాని కలిగిస్తాయి
మీ బరువును కంట్రోల్లో ఉంచుకోండి
- అధిక బరువు గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి మీరు మీ బరువును కంట్రోల్లో ఉంచుకోండి
- ప్రతిరోజూ కొంచెం నడవడం, చురుకుగా ఉండటం బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యులను సంప్రదించండి)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.