Health Tips: ఈ వ్యాధిగ్రస్తులకు.. బెండకాయలు విషయంతో సమానమట.. తినేముందు ఆలోచించండి

Health Tips: ఈ వ్యాధిగ్రస్తులకు.. బెండకాయలు విషయంతో సమానమట.. తినేముందు ఆలోచించండి


Health Tips: ఈ వ్యాధిగ్రస్తులకు.. బెండకాయలు విషయంతో సమానమట.. తినేముందు ఆలోచించండి

మన రోజువారీ ఆహారంలో తీసుకునే కూరగాయాల్లో బెండకాయ కూడా ఒకటి. ఇందులో ఉండే అనేక రకాల పోషకాల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, మలబద్ధక సమస్య నుంచి ఉపసమనం కలిగిస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కాలేయాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షిస్తాయి. గుండె సమస్యల చికిత్సలో చురుకైన పాత్ర పోషించే పాలీఫెనాల్స్ ఉన్నందున గుండె జబ్బులతో సంబంధం ఉన్న వాపును తగ్గించడానికి కూడా ఇది చాలా మంచిది.

కానీ బెండకాయ తినే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవలసి ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ అందరికీ మంచిది కాకపోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని వ్యాధులు ఉన్నవారికి ఇది ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీని గురించి డాక్టర్ అనిల్ పటేల్ మాట్లాడుతూ.. మూత్రపిండాల్లో రాళ్లు, ఆర్థరైటిస్, జీర్ణ రుగ్మతలు ఉన్నవారు బెండకాయ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహా మేరకు మాత్రమే వీరు వాటిని తినాలి.. లేదంలో వీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు.

  • ఎలాంటి సమస్యలను ఉన్నవారు బెండకాలయను తినకూడదు

మూత్రపిండాల్లో రాళ్లు

బెండకాయలో అధిక స్థాయిలో ఆక్సలేట్లు ఉంటాయి. ఇది శరీరంలోని కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేట్ రాళ్లను ఏర్పరుస్తాయి. ఇవి సాధారణంగా మూత్రపిండాలలో కనిపించే రాళ్ళు. ఇప్పుడు, మీకు వంశపారంపర్యంగా ఆరోగ్య సమస్య ఉంటే, బెండకాయను తినకుండా ఉండటం మంచిది. మీరు దానిని తింటుంటే, చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తినండి.

కీళ్ళవాతం

యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల కీళ్ల వాతం వస్తుంది. దీనివల్ల తీవ్రమైన నొప్పి కలుగుతుంది. బెండకాయలో  ఉండే ఆక్సలేట్లు యూరిక్ యాసిడ్ స్ఫటికీకరణకు సహాయపడతాయి. దీని వల్ల మీ పరిస్థితి మరింత దిగజార్చవచ్చు. కీళ్లవాతంతో బాధపడేవారు బెండకాయల పూర్తిగా దూంగా ఉండండి. ముఖ్యంగా సీతాకాలంలో వాటి జోలికి అస్సలూ వెళ్లకండి.

జీర్ణ సమస్యలు ఉన్న వ్యక్తులు

బెండకాలలో ఫైబర్ అధికంగా ఉన్నప్పటికీ, గ్యాస్, ఉబ్బరం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, అజీర్ణం వంటి సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.  ఎందుకంటే బెండకాయ తినడం వల్ల వారి సమస్యలు మరింత పెరగవచ్చు. అలా కాదని మీరు బెండకాయలను తింటే కడుపు నొప్పి, అసౌకర్యం కలుగుతాయి. ఈ పరిస్థితులు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే బెండకాయలను మీ హారంలో చేర్చుకోండి.

రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు

బెండకాయలో విటమిన్ K కి సమృద్ధిగా  ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. రక్తం పలుచబరిచే మందులు తీసుకునే వ్యక్తులకు, బెండకాయలను తినడం వల్ల వారి మందుల వినియోగంపై  ప్రభావంపై చూపుతుంది. అలాగే రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాంటి వ్యక్తులు బెండకాయను తీసుకోకుండా ఉండడం  లేదా డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాటిని తినడం చేయాలి. లేదంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *