Health Tips: ఈ పండు రాత్రి తింటే మ్యాజిక్ జరుగుతుంది.. అసలు విషయం తెలిస్తే అవాక్కే..

Health Tips: ఈ పండు రాత్రి తింటే మ్యాజిక్ జరుగుతుంది.. అసలు విషయం తెలిస్తే అవాక్కే..


చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తినాలని అనుకుంటారు. అందులో బొప్పాయి ఒక అద్భుతమైన ఎంపిక. కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా రాత్రిపూట బొప్పాయి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

బొప్పాయి తినడం వల్ల కలిగే రోజువారీ ప్రయోజనాలు:

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి జబ్బులు రాకుండా కాపాడుతుంది.

చర్మం మెరుస్తుంది: బొప్పాయిలో ఉండే విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముడతలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.

రక్తపోటు అదుపులో ఉంటుంది: బొప్పాయిలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.

కంటి చూపు మెరుగు: విటమిన్ ఎ ఎక్కువగా ఉండటం వల్ల కళ్లను రక్షించడంలో సహాయపడుతుంది.

నొప్పులు తగ్గుతాయి: బొప్పాయిలో మంటను తగ్గించే గుణాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

రాత్రిపూట బొప్పాయి ప్రత్యేక ప్రయోజనాలు:

జీర్ణక్రియ మెరుగు: బొప్పాయిలో పెపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. రాత్రి భోజనం తర్వాత తింటే కడుపు తేలికగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.

బరువు తగ్గడంలో : బొప్పాయిలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. ఒక చిన్న బొప్పాయిలో సుమారు 68 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనిలోని ఫైబర్, నీటి శాతం కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించి ఎక్కువసేపు ఆకలి వేయకుండా చూస్తుంది. రాత్రి ఏదైనా తీపి తినాలని అనిపించినప్పుడు బొప్పాయిని తింటే అదనపు కేలరీలు పెరగకుండా ఉంటుంది.

బొప్పాయి ఎలా తినాలి?

రాత్రి భోజనం చేసిన తర్వాత 30-60 నిమిషాల గ్యాప్ ఇచ్చి ఒక చిన్న గిన్నె బొప్పాయి ముక్కలు తినడం మంచిది. దానికి పంచదార లేదా క్రీమ్ కలపకుండా తినాలి. కావాలంటే కొన్ని బాదం లేదా వాల్‌నట్స్‌ను జోడించుకోవచ్చు.

జాగ్రత్తలు:

  • బొప్పాయిని అతిగా తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు.
  • బొప్పాయిని పాలతో కలిపి తినడం మంచిది కాదు.
  • ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) ఉన్నవారు బొప్పాయి తినడం వల్ల కొంత అసౌకర్యాన్ని అనుభవించవచ్చు.
  • ఆరోగ్యానికి బొప్పాయి ఎంతో మంచిది, కాబట్టి మీ రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకోండి.

( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *