సాధారణంగా జుట్టు రాలడానికి ఒక్కటే కారణం ఉంటుందని మనం చెప్పలేం. ఎందుకంటే ఇది మీ జీవనశైలి, ఆరోగ్యం, వంశపారంపర్య అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలకు ఒక్కొక్కటి కారనాలను పరిశీలింద్దాం. మొదటి వంశపారంపర్యత ఇది ప్రపంచవ్యాప్తంగా జుట్టు రాలడానికి అత్యంత సాధారణ కారణం. మీ కుటుంబంలో ఎవరికైనా బట్టతల లేదా జుట్టు పల్చబడే సమస్య ఉంటే, అది మీకు కూడా వచ్చే అవకాశం ఉంది.
హార్మోన్ల మార్పులు: మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటి కారణంగా కూడా హెయిప్ పాల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ సమస్యలు, గర్భధారణ, ప్రసవం లేదా మెనోపాజ్ వంటి సమయాల్లో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుందని చెబుతున్నారు.
పోషకాహార లోపం: ఒకప్పుడూ పుష్కలంగా పోషకాలు ఉండే ఆహారం లభించేంది. కానీ ఇప్పుడు అన్ని హైబ్రిడ్ కావడంతో పోషకమైన ఆహారం మనకు లభించట్లేదు. దీని కారణంగా శరీరంలో పోషకాలు తగ్గిపోతున్నాయి. అయితే మన శరీరంలో ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి12 లేదా ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు జుట్టు కుదుళ్లు బలహీనపడి రాయిపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
Hair Fall (1)
కెమికల్స్, వేడి: ఈ మధ్య స్టైల్ కోసం చాలా మంది జుట్టుకు రకరాల రంగులు వేస్తున్నారు. ఇది కూడా జుట్టు రాలేందుకు ఒక కారణం అంటున్నారు నిపుణులు జుట్టుకు రంగులు వేయడం, స్ట్రైటెనింగ్ చేయడం లేదా అధికంగా కెమికల్ షాంపూలు వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. సాధారణంగా రోజుకు 50 నుండి 100 వెంట్రుకలు రాలడం సహజమే. కానీ అంతకంటే ఎక్కువగా లేదా గుత్తులుగా రాలుతుంటే నిపుణులను సంప్రదించడం మంచిది.




