GVK మాల్ ముందున్న రోడ్ పేరు ఏంటో తెలుసా?

GVK మాల్ ముందున్న రోడ్ పేరు ఏంటో తెలుసా?


ప్రపంచమంతా ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వైపు ఆందోళనగా చూస్తోంది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందడం సంచలనంగా మారింది. అయితే, ఈ ఉద్రిక్తతల నడుమ హైదరాబాద్ నగరానికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన భాగ్యనగరంలోని ప్రముఖ ప్రాంతమైన బంజారాహిల్స్‌లో ఏకంగా ‘ఖమేనీ’ పేరుతో ఒక రోడ్డు ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 7, సరిగ్గా GVK One మాల్ ఎదురుగా ఉన్న రహదారిని అధికారికంగా ‘ఇమామ్ ఖమేనీ రోడ్’ అని పిలుస్తారు. ఇక్కడ ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం ఉండటంతో, కుతుబ్ షాహీల కాలం నుండి ఇరాన్-హైదరాబాద్ మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలకు గుర్తుగా అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఈ పేరు పెట్టింది. అయితే ఇది ప్రస్తుత నేత అలీ ఖమేనీ పేరు మీద కాకుండా, ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ రుహొల్లా ఖమేనీ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినదట. ఇరాన్ అగ్రనేత ఖమేనీ పూర్వీకులకు ఉత్తరప్రదేశ్‌తో బలమైన సంబంధాలు ఉండేవట. ఆయన తాతలు యూపీలోని బారాబంకి జిల్లా నుండి 19వ శతాబ్దంలో ఇరాన్‌కు వలస వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. తాజాగా ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో అలీ ఖమేనీ కుటుంబ సమేతంగా మరణించడంతో, పాత జ్ఞాపకాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. నగరంలోని ఈ రోడ్డు పేరు గురించి ఇప్పటివరకు తెలియని నెటిజన్లు, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ విషయాన్ని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాతబస్తీలో బ్రిడ్జి నిర్మాణం.. బెంబేలెత్తుతున్న జనం

ఇద్దరు చిన్నారుల గొంతు నులిమి చంపిన తల్లి.. కారణం ఇదే

కళ్ళు, ముక్కు లేకుండా ఆరోగ్యంగా పుట్టిన మేక పిల్ల.. చూసేందుకు ఎగబడుతున్న జనం

మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్‌

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *