GST 2.0: మోదీ దీపావళి గిఫ్ట్.. దిగొచ్చిన ధరలు.. ఇంతకీ ఏవి పెరిగాయో తెలుసా..?

GST 2.0: మోదీ దీపావళి గిఫ్ట్.. దిగొచ్చిన ధరలు.. ఇంతకీ ఏవి పెరిగాయో తెలుసా..?


GST 2.0: మోదీ దీపావళి గిఫ్ట్.. దిగొచ్చిన ధరలు.. ఇంతకీ ఏవి పెరిగాయో తెలుసా..?

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జీఎస్టీ గిఫ్ట్ అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబ్‌లకు బదులుగా కేవలం రెండు కొత్త స్లాబ్‌లు మాత్రమే అమలులో ఉన్నాయి. దీంతో నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ఎన్నో రేట్లు తగ్గాయి. ఇది ప్రజలకు మేలు చేసే నిర్ణయంగా చెప్పొచ్చు. వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా GST రేట్ల తగ్గించారు.

కొత్త జీఎస్టీ స్లాబ్‌లు ఎలా ఉన్నాయి?

5శాతం స్లాబ్: ప్రజలు రోజూ ఉపయోగించే ఆహార పదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆరోగ్య సంరక్షణ, విద్య, కొన్ని ముఖ్యమైన వస్తువులు ఈ స్లాబ్‌లో ఉంటాయి.

18శాతం స్లాబ్: సామాన్య వినియోగ వస్తువులు మరియు కొన్ని ఎలక్ట్రానిక్స్ ఈ స్లాబ్‌లో ఉన్నాయి.

40శాతం స్లాబ్: పాన్ మసాలా, సిగరెట్లు, లగ్జరీ కార్లు, పెద్ద బైక్‌లు, క్యాసినో, గుర్రపు పందాలు వంటి “పాపపు” మరియు విలాసవంతమైన వస్తువులకు ప్రత్యేకంగా 40% పన్ను విధించబడుతుంది.

ఏవి చౌకగా లభిస్తాయి?

ఆహార పదార్థాలు: పాలు, వెన్న, నెయ్యి, పనీర్, బిస్కెట్లు, చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్, పాస్తా, పరోటా, చపాతీ వంటివి 12-18శాతం పన్ను నుండి 5శాతానికి తగ్గాయి.

నిత్యావసరాలు: షాంపూ, హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్ వంటి వస్తువులు 18శాతం నుండి 5శాతానికి మారనున్నాయి.

ఎలక్ట్రానిక్స్: వాషింగ్ మెషీన్లు, టీవీలు వంటివి 28శాతం నుండి 18శాతానికి తగ్గుతాయి.

మరికొన్ని: వ్యవసాయ ఉత్పత్తులు, మందులు, విద్యా సంబంధిత వస్తువులు, చిన్న కార్లు, పాదరక్షలు, బట్టలు, టూ-వీలర్ల ధరలు తగ్గుతాయి.

ఏవి ఖరీదు..?

పాపపు వస్తువులు: పాన్ మసాలా, సిగరెట్లు, జర్దా వంటి వాటిపై పన్ను రేట్లు పెరిగాయి.

లగ్జరీ వస్తువులు: లగ్జరీ కార్లు, పెద్ద ఇంజిన్ ఉన్న బైక్‌లు, ఐపీఎల్ టికెట్లు వంటి విలాసవంతమైన వస్తువులపై 40శాతం పన్ను విధించబడుతుంది.

ఈ కార్ల ధరలు తగ్గాయ్..

ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, హోండా, టయోటా, నిస్సాన్ రెనాల్ట్ వంటి ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీలు ధరలను తగ్గించాయి. టయోటా లెజెండర్ మోడల్ రూ. 3.34 లక్షలు తగ్గింది. అటు మహీంద్రా అండ్ మహీంద్రా కూడా పెట్రోల్ మోడల్‌పైరూ. 2.56 లక్షల వరకు తగ్గించింది. టాటా, హ్యుందాయ్, మారుతి మోడల్, ఇంజిన్ రకాన్ని బట్టి రూ. 2.40 లక్షల వరకు తగ్గింపును ప్రకటించాయి.

కాగా ఈ జీఎస్టీ సంస్కరణల వల్ల రూ.2లక్షల ఆదాయం వస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అటు రాష్ట్రాలు సైతం సహకరించడంతోనే జీఎస్టీ సంస్కరణలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఈ కొత్త జీఎస్టీ వ్యవస్థ వల్ల సామాన్య ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. అదే సమయంలో విలాసవంతమైన వస్తువులు, సేవలు మరింత ఖరీదైనవిగా మారతాయి. ఈ సంస్కరణలు ఆర్థిక క్రమశిక్షణను పాటించడంలో సహాయపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *