GST 2.0: ఇప్పుడు చౌకైన కారు ఆల్టో కాదు! జీయస్టీతో సీన్ రివర్స్!

GST 2.0: ఇప్పుడు చౌకైన కారు ఆల్టో కాదు! జీయస్టీతో సీన్ రివర్స్!


జీయస్టీ మార్పు తర్వాత మారుతి సుజుకి చిన్న కార్ల ధరల్లో బాగా మార్పులు వచ్చాయి.  ఆల్టో తో పోలిస్తే.. ఎస్ -ప్రెస్సో కారు రేటు బాగా తగ్గడంతో ఇప్పుడిదే చౌకైన కారుగా మారింది.  మారుతి ఎస్ ప్రెస్సో కారుధర ఇప్పుడు కేవలం రూ. 3.50 లక్షలు మాత్రమే. ఒకప్పుడు ఆల్టో ఈ ధరకు లభించేది. ఇప్పుడు ఆల్టో ధర రూ. 3.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అంటే గత పదేళ్లుగా భారతదేశంలో అత్యంత చౌకైన కారుగా ఉన్న ఆల్టో ఇప్పుడు ఎస్ ప్రెస్సో కంటే ఖరీదైన కారుగా మారింది.

కారణం ఇదే..

రీసెంట్ గా ప్రభుత్వం కొత్త వాహనాలకు ఆరు ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి అనే రూల్ ను తీసుకొచ్చింది. అయితే ఆల్టో కె10 కారు ఈ అప్ డేట్ తో వస్తుంది. కానీ, ఎస్ ప్రెస్సో మాత్రం రెండు ఎయిర్ బ్యాగ్స్ కే పరిమితం చేయబడింది. అందుకే దీని ధర తక్కువగా ఉంది.

ఫీచర్లు

ఇక ఎస్ ప్రెస్సో కారు విషయానికొస్తే.. ఇందులో ఆల్టో లో ఉండే కె10 ఇంజిన్ ఉంటుంది. కానీ డిజైన్ ఒక మినీ ఎస్ యూవీలా ఉంటుంది. ఆల్టోతో పోలిస్తే.. ఎస్స్ ప్రెస్సో లోపలి క్యాబిన్ విశాలంగా, కారు సైజు కూడా కొద్దిగా పెద్దదిగా అనిపిస్తుంది. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇందులో 998 సిసి త్రీ సిలిండర్ ఇంజిన్.. 68 బిహెచ్‌పి పవర్,  90 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. 5 -స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది 25 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుంది. సేఫ్టీ ఫీచర్స్ విషయానికొస్తే డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగులు, ఇమ్మొబిలైజర్, సెంట్రల్ లాకింగ్, హై-స్పీడ్ వార్ణింగ్, సీట్-బెల్ట్ రిమైండర్, ప్రీ-టెన్షనర్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉన్నాయి. అలాగే 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తోపాటు ఆండ్రాడయిడ్ సపోర్ట్ కూడా ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *