
గూగుల్ లో స్మార్ట్‌గా సెర్చ్ చేయడం తెలిస్తే.. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మరింత స్పష్టంగా వస్తుంది. గూగుల్ సెర్చ్ లో ఉండే ఈ ట్రిక్స్ గురించి చాలామందికి తెలియదు.
కొటేషన్ మార్క్స్
గూగుల్ లో సెర్చ్ చేసేటప్పుడు డబుల్ కొటేషన్ మార్క్స్(“ ”) వాడడం ద్వారా ఆక్యురేట్ రిజల్ట్స్ పొందొచ్చు. ఉదాహరణకు ‘బెస్ట్ ఏఐ టూల్స్ ఫర్ స్టూడెంట్స్’ అని టైప్ చేస్తే రకరకాల సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. అదే స్టూడెంట్స్ అన్న పదానికి కొటేషన్స్ పెట్టి. బెస్ట్ ఏఐ టూల్స్ ఫర్ “స్టూడెంట్స్” అని టైప్ చేస్తే.. స్టూడెంట్స్ అన్న పదం ఉన్న సైట్స్ మాత్రమే కనిపిస్తాయి.
ఇన్ సైట్
మీకు ఓవరాల్ ఇన్ఫర్మేషన్ కాకుండా పర్టిక్యులర్ గా ఏదైనా సైట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ‘ సైట్: ’ అనే కోడ్ వాడొచ్చు. ఉదాహరణకు వెయిట్ లాస్ గురించి డబ్ల్యూహెచ్‌ఓలో పబ్లిష్ అయిన వివరాలు మాత్రమే కావాలనుకుంటే ‘ site: who.int weight loss ’ అని సెర్చ్ చేస్తే ఆ సైట్‌లో వెయిట్ లాస్ గురించి ఉన్న ఆర్టికల్స్ అన్నీ కనిపిస్తాయి.
ఫైల్ టైప్
గూగుల్‌లో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, ఇమేజెస్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, పీడియఫ్ లు వంటివి కూడా వెతకొచ్చు. అలాంటప్పుడు ఫైల్ టైప్స్‌ను బట్టి కూడా సెర్చ్ చేయాలి. ఉదాహరణకు ‘ నానో బనానా ఫొటో ప్రాంప్ట్స్’ అని టైప్ చేసి చివర్లో ‘filetype: pdf’ అని యాడ్ చేస్తే.. దానికి సంబంధించిన పీడీయఫ్ ఫైల్స్ మాత్రమే కనిపిస్తాయి.
సెర్చ్ బై ఇమేజ్
గూగుల్‌లో ఫొటోలను గుర్తించేందుకు గూగుల్ లెన్స్ సాయం తీసుకోవచ్చు. ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ఉన్న ఫొటోలను గూగుల్ లెన్స్‌లో అప్‌లోడ్ చేసి.. సెర్చ్ బై ఇమేజ్ అనే ఆప్షన్ ద్వారా ఆ ఇమేజ్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..