
గూగుల్ ఇచ్చే ఈ ఇంటర్న్‌షిప్ కేవలం అనుభవాన్ని మాత్రమే కాదు, కళ్లు చెదిరే స్టైఫండ్‌ను కూడా అందిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు గరిష్టంగా $12,000 (సుమారు రూ. 10 లక్షలు) వరకు లభిస్తుంది. అయితే, దీనికి కొన్ని ప్రత్యేక అర్హతలు మరియు నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా వాషింగ్టన్, డిసి కేంద్రంగా సాగే ఈ ఫెలోషిప్‌లో అండర్ గ్రాడ్యుయేట్ నుండి పీహెచ్డీ విద్యార్థుల వరకు ఎవరైనా చేరవచ్చు. మరి అర్హతలేంటి? అప్లికేషన్ డెడ్ లైన్ ఎప్పుడు? ఆ వివరాలు ఇప్పుడు మీకోసం సవివరంగా..
1. ఎవరెవరు అర్హులు?
విద్యా నేపథ్యం: అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), మరియు పీహెచ్డీ (PhD) చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఫుల్ టైమ్ లేదా పార్ట్ టైమ్ కోర్సు చేస్తున్నా పర్వాలేదు.
వయస్సు: జనవరి 1, 2026 నాటికి అభ్యర్థికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.
నైపుణ్యాలు: ఇంటర్నెట్, టెక్నాలజీ పాలసీపై ఆసక్తి ఉండాలి. మంచి రీసెర్చ్, రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి.
ముఖ్య గమనిక: అభ్యర్థులు యునైటెడ్ స్టేట్స్లో పనిచేయడానికి చట్టపరమైన అనుమతి (Work Authorization) కలిగి ఉండాలి. గూగుల్ వీసా ప్రాసెసింగ్‌లో ఎటువంటి సహాయం అందించదు.
2. స్టైఫండ్ వివరాలు:
ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారికి హోస్ట్ సంస్థ నుండి ఆకర్షణీయమైన స్టైఫండ్ అందుతుంది:
ఫుల్ టైమ్ (వారానికి 40 గంటలు): సుమారు $12,000 (రూ. 10 లక్షలు).
పార్ట్ టైమ్ (వారానికి 20 గంటలు): సుమారు $6,000 (రూ. 5 లక్షలు).
3. ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 9, 2026 (మధ్యాహ్నం 12:00 గంటల వరకు).
చేరాల్సిన తేదీ: ఆగస్టు 30, 2026 నాటికి గుర్తింపు పొందిన విద్యా సంస్థలో అడ్మిషన్ కలిగి ఉండాలి.
4. ఎలా దరఖాస్తు చేయాలి?
ఆసక్తిగల అభ్యర్థులు గూగుల్ అధికారిక కెరీర్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ ఫెలోషిప్‌లో పాల్గొన్న వారు తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు.