ఆయుర్వేదం మనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అత్యంత ప్రభావవంతమైన అనేక మూలికలను అందిస్తుంది. అందులో ఒకటి గోండ్ కటిర.. ఇది చెట్ల నుండి తీసుకోబడిన సహజ జిగురు పదార్థం. ఇది పసుపు, తెలుపు రంగులో ఉంటుంది. గోండ్ కటిర స్పర్శకు జిగటగా, ఎలాంటి రుచి, వాసనా లేకుండా ఉంటుంది. కానీ, దీని శక్తి మాత్రం అమోఘం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. గోండ్ కటిర ఆహారంలో భాగంగా తీసుకుంటే.. వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. శీతాకాలంలో వేడిగా ఉంచుతుంది. అన్ని కాలాల్లోనూ దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలు అందిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
గోండ్ కటిరా అంటే ఏమిటి..?
గోండ్ కటిరా, గమ్ కటిరా ఇది నీటిలో కరిగినప్పుడు జెల్లీ లాంటి స్థిరత్వంలోకి మారే పారదర్శక ఘన స్ఫటికంగా లభిస్తుంది. దీని ప్రత్యేక లక్షణాలు వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తాయి. శీతాకాలంలో వెచ్చదనాన్ని అందిస్తాయి. వచ్చేది శీతాకాలం కాబట్టి మీరు దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవాలనుకుంటే, ముందుగా దాని పోషక విలువలు, ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలు, అతిగా తీసుకుంటే కలిగించే దుష్ప్రభావాలను తెలుసుకోండి.
ఇవి కూడా చదవండి
గోండ్ కటిర ఉపయోగాలు అనేకం:
* చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, పోషించడానికి సహాయపడుతుంది.
* జలుబు, చిన్న గాయాలను నయం చేస్తుంది. సాంప్రదాయకంగా ఇంటి నివారణలలో ఉపయోగిస్తారు.
* ప్రసవానంతర సంరక్షణ: ఇది కొత్తగా తల్లైన మహిళలకు రెట్టింపు ప్రయోజనాలు కలిగిస్తుంది.
* శరీరాన్ని చల్లబరుస్తుంది: వేసవిలో శరీరాన్ని వేడి నుండి రక్షించడంలో సహాయపడుతుంది. హీట్ స్ట్రోక్ వంటి సమస్యలను నివారిస్తుంది.
* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం, క్రమరహిత ప్రేగు కదలికలు వంటి సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
* రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ఇది వ్యాధులకు శరీర నిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది.
* ఎముకలను బలపరుస్తుంది: దీనిలోని కాల్షియం, మెగ్నీషియం కంటెంట్ కారణంగా ఇది ఆస్టియో ఆర్థరైటిస్‌కు కూడా సహాయపడుతుంది.
* బరువు తగ్గడానికి సహాయపడుతుంది: ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.
* ముఖ్యంగా గోండు కటిర పురుషుల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా చెబుతారు. గోండ్ కటిరా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెంచి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని పెంచుతుంది. సంతానలేమి సమస్యలతో బాధపడేవారికి గొప్పగా హెల్ప్ చేస్తుంది. అయితే, వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది.
ఎలా తినాలి:
10 గ్రాముల గోండ్ కటిరాను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఆ మిశ్రమాన్ని వడకట్టి, 1 టీస్పూన్ చక్కెర వేసి తినండి. ఉత్తమ ఫలితాల కోసం, చల్లటి నీటితో రోజుకు మూడు సార్లు తీసుకోవచ్చు. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే ప్రభావవంతంగా ఉంటుంది. సహజంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
* అయితే, గోండ్ కటిరాను అధిక పరిమాణంలో తీసుకోవడం హానికరం.
* జీర్ణ సమస్యలు: అధిక వినియోగం వల్ల గ్యాస్, విరేచనాలు, కడుపు ఉబ్బరం సంభవించవచ్చు.
* మధుమేహ వ్యాధిగ్రస్తులకు జాగ్రత్త: రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయవచ్చు.
* అలెర్జీలు: కొంతమందికి దురద, దద్దుర్లు, వాపు వంటి లక్షణాలు కనిపించవచ్చు.
జాగ్రత్తగా, మితంగా తీసుకుంటే గోండ్ కటిరా మీ ఆరోగ్యానికి ఒక వరం లాంటిది. దీన్ని మీ ఆహారంలో సరైన మొత్తంలో చేర్చుకుని దాని ప్రయోజనాలను పొందండి.
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.