Gold, Silver Price Record: బులియన్ మార్కెట్ ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. పెట్టుబడిదారులు, వినియోగదారులు కొనుగోళ్లు చేయడం వల్ల వెండి, బంగారం ధరలు కొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. వెండి కూడా రికార్డులను బద్దలు కొట్టింది. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో వెండి రూ.1,900 పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. బంగారం ధరలు కూడా పెరిగాయి.
ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 21వ విడత విడుదల.. ఆ 3 రాష్ట్రాలకు మాత్రమే!
కిలో వెండి ధర రూ.1.43 లక్షలు:
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. వెండి ధరలు కిలోగ్రాముకు రూ.3,000 పెరిగి రూ.1,43,000 కు చేరుకుంది. గతంలో గురువారం కిలోగ్రాముకు రూ.1,40,000 వద్ద ముగిసింది. నిరంతర పండుగ షాపింగ్, బలమైన పెట్టుబడిదారుల ఆసక్తి వెండిని రికార్డు స్థాయికి నెట్టాయి. అయితే హైదరాబాద్, కేరళ, చెన్నై రాష్ట్రాల్లో మాత్రం భారీగా ఉంది. రూ1.53 లక్షల వరకు ఉంది.
ఇవి కూడా చదవండి
పెరిగిన బంగారం ధర:
బంగారం కూడా పెట్టుబడిదారులను నిరాశపరచడం లేదు. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకు రూ.400 పెరిగి ప్రస్తుతం రూ.1,14,880కి చేరుకుంది.
ప్రపంచ మార్కెట్ క్షీణత:
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దేశీయ మార్కెట్లో బంగారం, వెండి మెరుస్తున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో అవి తగ్గుతున్నాయి. స్పాట్ బంగారం ఔన్సుకు 0.12 శాతం తగ్గి 3,744.75 డాలర్లకు చేరుకోగా, వెండి ఔన్సుకు 0.35 శాతం తగ్గి 45.03 డాలర్లకు చేరుకుంది.
ఇది కూడా చదవండి: RBI: ఆర్‌బీఐ సామాన్యులకు దీపావళి బహుమతి ఇస్తుందా? అక్టోబర్ 1న నిర్ణయం తీసుకుంటుందా?
ప్రపంచవ్యాప్తంగా బలహీనత ఉన్నప్పటికీ భారతదేశంలో పండుగ సీజన్, స్టాకిస్టుల కొనుగోళ్లు పెరగడం బంగారం, వెండి ధరలను బలోపేతం చేశాయని నిపుణులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: iPhone: మీ ఐఫోన్ వేడెక్కుతోందా? ఇలా చేయండి..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి