
త్వరలో దసరా రాబోతోంది. ఆ తర్వాత దీపావళి ధమాకా ఉంది. దీనికితోడు GST కొత్త శ్లాబుల నేపథ్యంలో పుత్తడి రేట్లు పడిపోతాయని మిడిమిడిజ్ఞానంతో కొందరు చెబుతున్నారు. దీనిలో లాజిక్ ఏంటి బాబూ అని అడిగితే, వాళ్లు GST మ్యాజిక్ అంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త GST సిస్టమ్ ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం…
GST 2.0లో రెండే ట్యాక్స్ రేట్లు. ఒకటి 5 శాతం, మరొకటి 18 శాతం. గతంలో ఉన్న 4 రేట్లను రెండుకు కుదించింది కేంద్రం. 12శాతం శ్లాబ్‌లోని 99శాతం వస్తువులు 5 శాతం శ్లాబ్‌లోకి వచ్చేసినట్లే. 28శాతం శ్లాబ్‌లోని 90శాతం వస్తువులు 18శాతం పరిధిలోకి వస్తాయి. దీంతో చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ నెల 22నుంచి కొత్త GST రేట్లు అమల్లోకి రానున్నాయి.
పండుగ సీజన్‌లో ప్రజలకు బెనిఫిట్ చేకూరనుంది.
ఇక ఇదే పాయింట్‌ని పట్టుకుని కొందరు, GST రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి గోల్డ్ రేట్లు కూడా తగ్గుతాయని ప్రచారం చేస్తున్నారు. అయితే అది నిజం కాదంటున్నారు అనలిస్టులు. గోల్డ్ రేట్లు తగ్గే సూచనలు ఇప్పట్లో లేవంటున్నారు. హైదరాబాద్‌లో ప్రజంట్ 24 క్యారట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,14,300గా ఉంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,05,840 వద్ద ట్రేడవుతుంది. గోల్డ్, సిల్వర్ మీద 3 శాతం GST ఉంటుంది. మజూరీ చార్జెస్ 5 శాతం. గోల్డ్ కాయిన్స్, బార్స్ మీద 3శాతం GST ఉంటుంది. గతంలో కూడా గోల్డ్ మీద ఇవే GST రేట్లు ఉన్నాయి.
పాత GST అయినా, కొత్త GST అయినా గోల్డ్‌పై పన్ను రేటులో ఎలాంటి మార్పు లేదు. అదే 3 శాతం కొనసాగుతోంది. 18, 22, 24 క్యారెట్ల బంగారం..ఏదైనా సరే 3 శాతమే GST. సో…ఈ పండుగ సీజన్‌లో బంగారం రేట్లు తగ్గుతాయని గంపెడాశలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సోషల్ మీడియా ప్రచారాలు నమ్మొద్దని, ఈ నెల 22 తర్వాత కూడా బంగారం రేట్లు ఏమీ తగ్గబోవని చెబుతున్నారు వాళ్లు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి