Gold Rates: రేట్ల సంగతి సరే! అసలు బంగారంలో జరిగే కల్తీ గురించి తెలుసా?

Gold Rates: రేట్ల సంగతి సరే! అసలు బంగారంలో జరిగే కల్తీ గురించి తెలుసా?


Gold Rates: రేట్ల సంగతి సరే! అసలు బంగారంలో జరిగే కల్తీ గురించి తెలుసా?

ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తోంది. కొన్నిరోజుల్లో దసరా, ఆ తర్వాత దీపావళి.. వరుసగా పండుగలు రాబోతున్నాయి. అందుకే ఈ సీజన్ లో చాలామంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గుల వస్తుండడంతో అధిక లాభం కోసం కొంతమంది వ్యాపారులు బంగారాన్ని  కల్తీ చేస్తుంటారు. బంగారు నగల తయారీలో కాడ్మియం అనే లోహాన్ని వాడి దాన్ని 22 క్యారెట్ల గోల్డ్ గా చెప్తుంటారు.  అయితే ఎంతో విలువైన బంగారాన్ని కొనుగోలు చేసేముందు కొన్ని విషయాలు మైండ్‌లో పెట్టుకోవాలి. బంగారం కొనే విషయంలో మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదెలాగంటే..

హాల్ మార్క్

బంగారు ఆభరణాలు కొనేటప్పుడు అందులోని బంగారం ఎంత స్వచ్ఛమైనది అని తెలిపేందుకు నగలపై హాల్‌మార్క్ గుర్తు ఉంటుంది. నగలు కొనేముందు దాన్ని గమనించుకోవాలి. లోకల్ షాపుల్లో బంగారం కొనేవాళ్లు దీన్ని కచ్చితంగా గమనించుకోవాలి. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. అలాగే హాల్‌మార్కింగ్ ఒరిజినలా? కాదా ? అని మీకు అనుమానం ఉంటే దాన్ని బీఐఎస్(BIS) కేర్ మొబైల్ యాప్ ద్వారా గుర్తించొచ్చు.

రాళ్లకు సెపరేట్ గా..

బంగారు ఆభరణాల్లో రాళ్లు, పగడాలు, వజ్రాల వంటివి ఉంటే.. బిల్లు వేసేటప్పుడే వాటికి సెపరేట్‌గా విలువ కడుతున్నారో లేదా చూసుకోవాలి. సాధారణ డిజైనర్ రాళ్లకు విలువ ఉండదు. అలాగే పగడాలు, కెంపులు వంటి వాటికి కొద్దిగా రీసేల్ వాల్యూ ఉంటుంది. వజ్రాలకు దాన్ని క్వాలిటీని బట్టి సెపరేట్‌గా రీసేల్ వాల్యూ ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని బంగారు నగలు కొనుగోలు చేయాలి.

డిజిటల్ పేమెంట్స్

బంగారు నగలు ఎంతో విలువైన వస్తువులు. కాబట్టి వాటిని కొనేటప్పుడు అధికారిక ఇన్‌వాయిస్‌ లేదా బిల్లుని తీసుకోవాలి. ఫ్యూచర్‌‌లో బంగారం అమ్మేటప్పుడు ఆ బిల్లు పనికొస్తుంది.  కొన్ని దుకాణాలు నకిలీ బంగారం అంటకట్టి నకిలీ బిల్లులు ఇస్తుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే బిల్లును డిజిటల్‌ పేమెంట్స్‌ ద్వారా కడితే ఫ్యూచర్ లో సమస్య వచ్చినప్పుడు ప్రూఫ్ గా పనికొస్తుంది.

బిస్కెట్లు

ఇన్వెస్ట్ మెంట్ లో భాగంగా బంగారాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటే బంగారు ఆభరణాలకు బదులు గోల్డ్ కాయిన్స్‌ లేదా బిస్కెట్లను కొనుగోలు చేయొచ్చు. ఇవి పూర్తి నాణ్యత కలిగి ఉంటాయి. వీటిని రీసేల్ చేసేటప్పుడు తరుగు ఉండదు. వీటిని బ్యాంకుల్లో కొనుగోలు చేసి అక్కడే దాచుకోవచ్చు.

ఛార్జీలు

బంగారం కొనేటప్పుడు తరుగు, మజూరీ వంటి వాటిని ఎలా లెక్క కడుతున్నారో గమనించుకోవాలి. వాల్యూ యాడెడ్ ఛార్జీల గురించి తెలుసుకోవాలి. అలాగే  దుకాణాలు, ప్రాంతాలను బట్టి బంగారం ధరలో మార్పులుంటాయి. కొనుగోలు చేసేముందు రెండు, మూడు చోట్ల ధరల గురించి ఆరా తీయడం మంచిది.

స్వచ్ఛమైన బంగారం

బంగారంలో పలు రకాలుంటాయి. కొద్దిశాతం మాత్రమే బంగారం కలిసిన నగలు కూడా ఉంటాయి. అలాగే పూర్తిగా బంగారంతో చేసిన నగలూ ఉంటాయి. స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు 24 క్యారెట్ల బంగారానికి  ప్రాధాన్యం ఇవ్వాలి. 24 క్యారెట్ల బంగారంలో 99.9శాతం స్వచ్ఛత ఉంటుంది. బంగారాన్ని కొనుగోలు చేయడం కోసం మీకు బాగా నమ్మకం ఉన్న వ్యాపారులను లేదా పేరున్న షాపులను ఎంచుకోవాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *