Gold Rates: ఈ 7 కారణాల వల్లే గోల్డ్ రేట్లు మారుతుంటాయని తెలుసా?

Gold Rates: ఈ 7 కారణాల వల్లే గోల్డ్ రేట్లు మారుతుంటాయని తెలుసా?


మనదేశంలో బంగారానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ముఖ్యంగా మనదేశంలో బంగారాన్ని ఒక ఆర్థిక ఆసరాగా భావిస్తుంటారు. అందుకే బంగారం కొనుగోళ్లు మనదేశంలో చాలా ఎక్కువ.  అయితే బంగారం కొనేవాళ్లు వాటి ధరల్లో వచ్చే మార్పులను గమనించే ఉంటారు. ఇటీవల గోల్డ్ రేట్స్ ఆల్ టైం హయ్యెస్ట్ కు చేరుకున్నాయి. కొన్ని సార్లు తగ్గుతాయి కూడా.. అసలు ఈ మార్పులు ఎందుకు జరుగుతాయంటే..

1. కరెన్సీ ఎక్స్‌ఛేంజ్

బంగారం ధరలు మారడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యంలో వచ్చే మార్పుల కారణంగా గోల్డ్ రేట్స్ మారుతుంటాయి. అంతర్జాతీయంగా బంగారం అమెరికా డాలర్లలో ట్రేడ్ అవుతుంది కాబట్టి.. అమెరికా డాలరుతో పోలిస్తే భారత రూపాయి బలహీనపడినప్పుడు బంగారం దిగుమతి ఖర్చు పెరుగుతుంది. దాంతో భారతదేశంలో బంగారం ధరలు మారుతుంటాయి.

2. వరల్డ్ ఎకానమీ

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్టెబిలిటీ లేనప్పుడు ఇన్వెస్టర్లు స్టాక్స్ కు బదులు సేఫ్ ఆప్షన్ కింద  బంగారాన్ని కొంటుంటారు. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరిగి..  ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.

3. యుద్ధాలు

ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు, సంఘర్షణలు లేదా రాజకీయ అస్థిరతలు ఉన్నప్పుడు ప్రపంచ మార్కెట్లలో ఇన్ స్టెబిలిటీ పెరిగి ఆ ప్రభావం బంగారం ధరలపై పడుతుంది.

4. ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం (inflation) పెరిగినప్పుడు కూడా బంగారం ధరల్లో మార్పులొస్తాయి. ఇన్ ఫ్లేషన్ పెరిగినప్పుడు డబ్బు విలువను తగ్గిపోతుంది. కానీ, బంగారం అంతర్జాతీయంగా విలువైన సంపద కాబట్టి దాని విలువ తగ్గదు. అందుకే ఇన్ ఫ్లేషన్ పెరిగినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది.

5. వడ్డీ రేట్లు

ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఏవైనా కొత్త పన్ను విధానాలు లేదా వడ్డీ రేట్లలో మార్పులు చేసినప్పుడు కూడా బంగారం ధరల్లో మార్పులొస్తాయి.

6. డిమాండ్

బంగరానికి డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమెటిక్ గా ధరలు పెరుగుతాయి. అందుకే పండుగలు, పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధరలు కాస్త పెరగడాన్ని మనం గమనించొచ్చు.

7. ప్రొడక్షన్ కాస్ట్

బంగారాన్ని తయారు చేయడం లేదా బంగారు ఆభరనాలను తయారు చేసే ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి వ్యయం పెరిగినప్పుడు లేదా వాటికి కావల్సిన టెక్నాలజీ, మెషినరీ ఖర్చులు పెరిగినప్పుడు కూడా బంగార ధరలు పెరుగుతుంటాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *