
నవరాత్రి రెండవ రోజు బంగారం ధరలు రికార్డులను బద్దలు కొట్టాయి. ఈ రోజు మంగళవారం సెప్టెంబర్ 23న బంగారం ధరలు భారీ పెరుగుదలతో 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.11,569లకు చేరింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.10,605 లకు చేరింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.8,677లకు పలుకుతోంది. దేశారాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలతో పాటు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
దేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఉదయంతో పోల్చితే మధ్యాహ్నం తరువాత బంగారం ధరలలో భారీ పెరుగుదల కనిపించింది. గోల్డ్ ధరలతో తన రికార్డులను తానే బద్ధలు కొడుతోంది. పసిడి ధర ఏకంగా చరిత్రలో తొలిసారిగా 1.15 లక్షల రూపాయలు దాటి కొత్త అధ్యాయానికి తెర లేపింది. ఇవాళ ఒక్కరోజే 10గ్రాముల గోల్డ్ ధర సుమారు రూ.2,700వరకు పెరిగింది. ఢిల్లీలో 24క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,15,840కు చేరింది. అటు కేజీ వెండి ధర రూ. 1,50,000లు పలుకుతోంది.
పసిడి పరుగులు ఒక్క రోజులోనే రూ. 2 వేలు పెరగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీపావళి నాటికి బంగారం ధరలు భారీగా పెరుగుతాయని అంతా అనుకుంటే, దానికి ముందే ధరలు ఈ స్థాయికి చేరుకోవడం అందరికీ ఆందోళనకు గురిచేస్తోంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి పెరిగిన ధరలు ఇబ్బందికరంగా ఉన్నాయనే చెప్పాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి