
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా కలిసి యుద్దానికి దిగిన క్రమంలో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన క్రమంలో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. దీంతో యుద్దం మరింత తీవ్రస్థాయికి ముదరడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ క్రమంలో బంగారం, సిల్వర్‌లోకి పెట్టుబడులు పెరగడంతో పసిడి ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. మరికొద్ది రోజుల పాటు పసిడి ధరలు ఇలాగే కొనసాగే అవకాశముంది. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో, ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. సోమవారం మరోసారి గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
బంగారం ధరలు చూస్తే..
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,73,090 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,73,080 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు రూ.1,58,660 వద్ద ట్రేడవుతోండగా.. ఆదివారం రూ.1,58,650 వద్ద స్థిరపడింది
-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ధర రూ.1,73,090 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,58,660 వద్ద ట్రేడవుతోంది
-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,72,100గా ఉండగా.. నిన్న రూ.1,72,090 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ ధర ప్రస్తుతం రూ.1,57,760 వద్ద ఉండగా.. ఆదివారం రూ.1,57,750 వద్ద స్థిరపడింది
-బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,73,090 వద్ద ఉండగా.. నిన్న రూ.1,73,080 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,58,660గా ఉంది. ఆదివారం ఈ ధర రూ.1,58,650 వద్ద స్థిరపడింది
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,73,240 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,810 వద్ద ఉంది
వెండి రేట్లు ఇవే..
-ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2,94,900 వద్ద కొనసాగుతోంది. ఆదివారం ఇది రూ.2.95,000 వద్ద స్థిరపడింది
-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.3,25,100 వద్ద కొనసాగుతోంది. నిన్న దీని ధర రూ.3.25 లక్షలుగా ఉంది
-చెన్నైలో కేజీ వెండి ధర రూ.3,25,100 వద్ద కొనసాగుతోంది. నిన్న దీని ధర రూ.3.25 లక్షలుగా ఉంది
-బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2,94,900 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2.95 లక్షలుగా ఉంది