Gold Price Today: మళ్లీ రూ.3 లక్షలకు చేరిన వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?

Gold Price Today: మళ్లీ రూ.3 లక్షలకు చేరిన వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?


Gold Price Today: మళ్లీ రూ.3 లక్షలకు చేరిన వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?

Gold, Silver Price Today: గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా ఎగబాకుతోంది. ఇటీవల తగ్గుముఖం పట్టి బంగారం, వెండి ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. అనిశ్చితిలో ఉన్న విలువైన లోహాల ధరలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. వెండి ధర కిలోకు 3 లక్షల రూపాయలకు చేరుకుంది. తాజాగా మార్చి 12న దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,320 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,710 వద్ద ట్రేడవుతోంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,320 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,710 వద్ద ట్రేడవుతోంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,860 వద్ద ట్రేడవుతోంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,320 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,710 వద్ద ట్రేడవుతోంది.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,320 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,710 వద్ద ట్రేడవుతోంది.
  6. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,960 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,51,210 వద్ద ట్రేడవుతోంది.
  7. ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో ధర రూ.2,99,900 వద్ద కొనసాగుతోంది. ఇతర నగరాల్లో రూ.2,89,900 వద్ద ట్రేడవుతోంది. అయితే హైదరాబాద్‌తో పాటు చెన్నై, కేరళలో ఎక్కువగా ఉంది. ఇతర నగరాల్లో తక్కువగా ఉంది.

ఇదిలా ఉండగా, భౌగోళిక రాజకీయ పరిణామాలు, అమెరికా డాలర్ విలువ తగ్గడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై సానుకూల వ్యాఖ్యలు చేయడంతో డాలర్ ఇండెక్స్ స్వల్పంగా బలహీనపడింది. సాధారణంగా డాలర్ విలువ తగ్గినప్పుడు ఇతర కరెన్సీల వినియోగదారులకు బంగారం కొనడం చౌకగా మారుతుంది. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరుగుతాయి.

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, డాలర్ హెచ్చుతగ్గులు ప్రస్తుతం బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారం తన పంతాన్ని నిలబెట్టుకుంటుండగా, పారిశ్రామిక అవసరాల వల్ల వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *