Headlines

Gold Price Today: బాబోయ్‌ బంగారం.. భయపడిపోతున్న మహిళలు.. భారీగా పెరిగిన పసిడి

Gold Price Today: బాబోయ్‌ బంగారం.. భయపడిపోతున్న మహిళలు.. భారీగా పెరిగిన పసిడి


Gold Price Today: బంగారం అంటేనే మహిళలు భయపడిపోతున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో గ్రాము బంగారం కొనాలంటేనే భయపడిపోయే పరిస్థితులు వచ్చాయి. రోజురోజుకు బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాము. పండగలు, ఇతర శుభ కార్యలకు బంగారం తప్పకుండా కొనాల్సిందే. దేశంలో ఎంత పేద కుటుంబం అయినా కొద్దిగానైనా బంగారం ఉంటుంది. అలాంటి ఇప్పుడు బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. తులం బంగారం కొనుగోలు చేయాలంటే లక్షా 16 వేలకుపైగా పెట్టుకోవాల్సిందే. తాజాగా సెప్టెంబర్‌ 30వ తేదీ దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటికి ఇప్పటికి పోలిస్తే తులం బంగారంపై ఏకంగా 930 రూపాయలు పెరిగింది.

ఇది కూడా చదవండి: Bank Holidays: నేటి నుండి వరుసగా 10 రోజులు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా..?

గత రెండు మూడు రోజులుగా చూస్తే దాదాపు తులంపై 2000 రూపాయలకుపైగానే ఎగబాకింది. ధర పెరిగిన తర్వాత మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,410 ఉంది. ఇక వెండి ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇది కూడా వెయ్యి రూపాయలు పెరిగి ప్రస్తుతం కిలో వెండి ధర 1 లక్ష 50 వేల రూపాయల వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో అయితే ఇంకా భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర 1 లక్ష 60 వేల వరకు ఉంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు..లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ:

–  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,560

–  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,860

ముంబై:

–  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,410

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,710

హైదరాబాద్‌:

–  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,410

–  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,710

విజయవాడ:

–  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,410

–  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,710

చెన్నై:

–  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,740

–  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,010

బెంగళూరు:

–  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,410

–  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,710

అలాగే మీరు బంగారం కొన్నప్పుడల్లా దాని స్వచ్ఛతను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ బంగారం స్వచ్ఛతను ధృవీకరించడానికి హాల్‌మార్క్‌ను ఉపయోగిస్తుంది. ఈ హాల్‌మార్క్ మీ బంగారంలో ఎన్ని క్యారెట్ల బంగారం ఉందో మీకు తెలియజేస్తుంది. 24 క్యారెట్ బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. చాలా వరకు బంగారం 22 క్యారెట్లలో అమ్ముతారు. కొంతమంది 18 క్యారెట్‌ను కూడా ఉపయోగిస్తారు.

ఇది కూడా చదవండి: LPG Gas Port: అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక మీ గ్యాస్ కనెక్షన్‌ను మొబైల్ సిమ్ లాగా పోర్ట్?

ఇది కూడా చదవండి: TVS: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన టీవీఎస్‌ బైక్‌, స్కూటర్ల ధరలు

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *