Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇంకా తగ్గే అవకాశం

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇంకా తగ్గే అవకాశం


Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇంకా తగ్గే అవకాశం

పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. రెండు దేశాలు మరో దేశం మీద సాగిస్తున్న దండయాత్రతో ప్రపంచం మొత్తం తీవ్ర ఆందోళన నెలకొంది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లను, బులియన్ మార్కెట్ ని కుదిపేస్తోంది. ప్రధానంగా బంగారం మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా పడింది. పసిడి ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియని పరిస్థితి. యుద్ద ప్రభావంతో డాలర్ వేగం పుంజుకోవడంతో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే పెట్టుబడిదారులు డాలర్ పెరిగినా అటు వైపు పెట్టుబడులను మళ్లించేందుకు సాహసించడం లేదు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో మళ్లీ ఉద్రిక్తతలు కాస్త ముదిరితే సేఫ్ సైడ్‌గా బంగారం మీదకు పెట్టుబడులను మళ్లించేందుకు రెడీ అవుతున్నారు.దీంతో పసిడి ధరలకు రెక్కలు వచ్చేలా ఉన్నాయి. ఈ రొజు బంగారం ధరలు చూసుకున్నట్లయితే కాస్త తగ్గాయి. అయితే తగ్గినా మరికొన్ని రోజులు వెయిట్ చేయడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. మార్చి 14, శనివారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల 10 గ్రాముల Gold ధర రూ.1,030 తగ్గి రూ.1,59,660 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల10 గ్రాముల బంగారం ధర రూ.950 తగ్గి రూ.1,46,350 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండిపై రూ.10,000 తగ్గి, రూ.2,80,000లు పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో మార్చి 14 శనివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే. మార్చి 14, శనివారం వివిధ నగరాల్లో బంగారం ధరను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,810 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,46,500 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,59,660 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,46,350 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61,020 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,47,600 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,660 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,350 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,80,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..

పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య

శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో

కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!

10th Class Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *