Headlines

Gold Price: వామ్మో.. బంగారం, వెండి అంటేనే భయమేస్తోంది.. రికార్డ్‌ స్థాయిలో పెరిగిన ధరలు

Gold Price: వామ్మో.. బంగారం, వెండి అంటేనే భయమేస్తోంది.. రికార్డ్‌ స్థాయిలో పెరిగిన ధరలు


Gold and SIlver Prices: బంగారం, వెండి ధరలు మళ్లీ రికార్డు బద్దలు కొట్టేలా కనిపిస్తున్నాయి. అందనంత ఎత్తుకు దూసుకెళ్తున్నాయి. గత కొన్ని రోజులుగా నెల చూపులు చూస్తున్న ఈ రెండు లోహాల ధరలు.. అకస్మాత్తుగా ఎగబాకాయి. ఫిబ్రవరి 28న భారీ స్థాయిలో ధరలు పెరిగాయి. ప్రతి రోజు బంగారం, వెండి ధరలు ఉదయం 11 గంటల సమయంలో అప్‌డేట్‌ అవుతుంటాయి. అయితే అప్‌డేట్‌ తర్వాత ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.

Rule Change: మార్చి 1 నుంచి మారే ఈ 4 నియమాల గురించి మీకు తెలుసా?

24 క్యారెట్ల తులం బంగారంపై ఎంత పెరిగింది?

ఇక 24 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై ఏకంగా 3160 రూపాయలు పెరిగింది. ధర పెరిగిన తర్వాత తులం ధర 1,64,730 రూపాయలకు చేరుకుంది. మెల్లమెలగా లక్షా 70 వేలకు చేరువలో ఉంది.

22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై ఎంత పెరిగింది?

ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 2900 రూపాయల వరకు ఎగబాకింది. ధర పెరిగిన తర్వాత తులం ధర 1,51,100 రూపాయల వద్ద ట్రేడుతోంది.

ఇవి కూడా చదవండి

18 క్యారెట్లపై ఎంత పెరిగింది?

18 క్యారెట్ల 10 గ్రాములపై 2370 రూపాయలు పెరిగింది. ధర పెరిగిన తర్వాత తులంపై 1,23,550 రూపాయల వద్ద కొనసాగుతోంది.

వెండి ధర ఎంత పెరిగింది?

ఇక బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. కిలో వెండిపై ఏకంగా 10,000 రూపాయల వరకు పెరిగింది. ధర పెరిగిన తర్వాత కిలో వెండి ధర 3 లక్షల రూపాయలకు చేరుకుంది.

హైదరాబాద్‌లో తులం ధర ఎంత?

ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,64,730 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,51,000 వద్ద కొనసాగుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,23,550 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అలాగే వెండి ధర రూ.లక్షలకే చేరుకుంది.

IRCTC: ఈ బిజినెస్‌ చేస్తే ఉద్యోగమే అవసరం లేదు.. నెలకు రూ.85 వేల ఆదాయం..!

Mukesh Ambani: అంబానీ లైఫ్‌స్టైల్‌లో ఓ కీలక విషయాన్ని వెల్లడించిన కుమారుడు ఆకాశ్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *