దీపావళి దగ్గర పడుతుండటం, నవరాత్రి ఉత్సవాలు జోరుగా సాగుతుండటం వలన చాలా మంది డిస్కౌంట్లు, ధరల తగ్గింపు, GST చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో, నిత్యావసరాల ధరల గురించి మాట్లాడుకుంటున్నా.. అసలు అందరికి ఎంతో ఇష్టమైన బంగారం పరిస్థితి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జీఎస్టీలో వచ్చిన మార్పులతో దీపావళి వరకు బంగారం ధర ఎలా ఉండబోతుందనేది చూద్దాం..
మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నా లేదా బంగారం కొనాలని అనుకుంటున్నా దీపావళికి ముందు కొనడం ఎల్లప్పుడూ తెలివైన పనిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. బంగారంపై GST రేటు 3 శాతం వద్ద స్థిరంగా ఉంది. కాబట్టి ఇందులో ఆశ్చర్యం లేదు! అయితే ఆభరణాలపై తయారీ ఛార్జీలు వాటి స్వంత GSTతో వస్తాయనే విషయం తెలిసిందే. మీరు డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటే అది కూడా అదే 3 శాతం GSTని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ పండుగ సీజన్‌లో బంగారం కొనడం ఉత్తమం. పైగా పండగ ఆఫర్లు కూడా ఉంటాయి.
బంగారం ధరలు ఎలా ఉన్నాయి..?
ఢిల్లీలో ప్రస్తుత బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,475గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,200. అదనపు తయారీ ఛార్జీలు గ్రాముకు రూ.240. బంగారంపై జీఎస్టీ 3 శాతమే ఉన్నా.. ఆభరణాల వ్యాపారులు తమ చేతిపనుల కోసం 5 శాతం తయారీ రుసుము వసూలు చేస్తారు. దాని పైన కూడా GST ఉంది. సో.. వాస్తవానికి రెండుసార్లు GST చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి బంగారంపై, ఒకసారి తయారీ ఛార్జీలపై ఈ రెండు-స్లాబ్ GST వ్యవస్థ ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి