గుమ్మడి కాయ 10, 20 కిలోలు కాదు ఏకంగా వందల కేజీలు ఉంది. రష్యాకు చెందిన ఒక రైతు పండించిన గుమ్మడికాయ ఏకంగా 969 కిలోల బరువు ఉంది. దీంతో అతను ప్రపంచంలో అతి పెద్ద గుమ్మడికాయను పండించిన రైతుగా రికార్డ్ సృష్టించాడు. అలెగ్జాండర్ చుసోవ్ అనే రైతు భారీ గుమ్మడికాయను పండించి రికార్డును సృష్టించాడు. ఇటీవల మాస్కోలో భారీ కూరగాయల పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో ఈ పెద్ద గుమ్మడికాయను ప్రదర్శించారు. దీని బరువు 969 కిలోలు (2130 పౌండ్లు). ఇది రష్యాలోనే అతిపెద్ద గుమ్మడికాయగా రికార్డు నెలకొల్పింది. ఈ పోటీల్లో దాదాపు 3 వేల మంది రైతులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
తన గుమ్మడికాయ గురించి రైతు చుసోవ్ మట్లాడుతూ.. ఈ భారీ గుమ్మడి కాయను పండించడానికి తనకు ఆరు నెలల కంటే ఎక్కువ సమయం పట్టిందని చెప్పారు. దీని కోసం స్పెషల్ గ్రీన్ హౌస్‌ను నిర్మించినట్లు… ఎప్పుడు నేల, గాలి తగినంత వేడి ఉండేలా చర్యలు తీసుకుని అత్యంత జాగ్రత్తతో పందిచినట్లు చెప్పాడు. ఈమొక్క పెరగడానికి.. గుమ్మడి కాయ ఎదుగుదల కోసం అవసరం అయినంత మేర ఎరువులు, నీరుని అందించినట్లు తెలిపారు. ఇప్పుడు రష్యాలో పండించిన అత్యంత బరువైన గుమ్మడికాయగా తన సొంత రికార్డును తానే బద్దలు కొట్టాడు. కాగా ఇదే పోటీల్లో 144 కేజీల బరువున్న పుచ్చకాయ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం విశేషం.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..