Ghostlighting Trend: బ్రేకప్ కంటే భయంకరం ‘ఘోస్ట్‌ లైటింగ్’.. మాయమై మళ్ళీ ఏమీ ఎరగనట్లు వస్తున్నారా?

Ghostlighting Trend: బ్రేకప్ కంటే భయంకరం ‘ఘోస్ట్‌ లైటింగ్’.. మాయమై మళ్ళీ ఏమీ ఎరగనట్లు వస్తున్నారా?


Ghostlighting Trend: బ్రేకప్ కంటే భయంకరం ‘ఘోస్ట్‌ లైటింగ్’.. మాయమై మళ్ళీ ఏమీ ఎరగనట్లు వస్తున్నారా?

డేటింగ్ యాప్స్ సంస్కృతి పెరిగాక, బంధాల నుంచి తప్పుకోవడానికి కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో వెలుగులోకి వచ్చిన అత్యంత భయంకరమైన ట్రెండ్ ‘ఘోస్ట్‌లైటింగ్’. ఇది సాధారణ బ్రేకప్ కంటే బాధితులను మానసిక క్షోభకు గురిచేస్తోంది.

సాధారణంగా ఎవరితోనైనా మాట్లాడటం ఇష్టం లేకపోతే కొందరు సడెన్‌గా కమ్యూనికేషన్ కట్ చేస్తారు. దీనిని ‘ఘోస్టింగ్’ అంటారని మనందరికీ తెలుసు. అయితే, దీనికి ‘గ్యాస్‌లైటింగ్’ తోడైతే వచ్చేదే ‘ఘోస్ట్‌లైటింగ్’. అంటే, అవతలి వ్యక్తి తప్పు ఏమీ లేకపోయినా, అంతా వారి వల్లే జరిగిందన్నట్లుగా నమ్మించి మాయం అవ్వడం. అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో వివరంగా చూద్దాం.

ఘోస్ట్‌లైటింగ్ అంటే..

ఇది ఘోస్టింగ్ మరియు గ్యాస్‌లైటింగ్ కలయికతో పుట్టిన ఒక ప్రమాదకరమైన మనస్తత్వం. ఇందులో భాగస్వామి ముందుగా మీ మీద లేనిపోని నిందలు వేయడం ప్రారంభిస్తారు. “నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు”, “నీకు ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ” అంటూ చిన్న విషయాలను పెద్దవి చేసి చూపిస్తారు. ఆ తర్వాత ఒక్కసారిగా కాల్స్, మెసేజెస్ ఆపేస్తారు. దీంతో ఎదుటి వ్యక్తి “అయ్యో నా వల్లే గొడవ అయిందేమో” అని గిల్టీగా ఫీల్ అవుతూ కుమిలిపోతుంటారు. డేటింగ్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారం, ఘోస్ట్‌లైటింగ్ చేసేవారు వాస్తవాలను చాలా తెలివిగా వక్రీకరిస్తారు. వీరు కొన్నాళ్ల తర్వాత మళ్ళీ మీ లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తారు.

అప్పుడు “నువ్వు బిజీగా ఉన్నావని నేను డిస్టర్బ్ చేయలేదు”, “నీకు కాస్త స్పేస్ కావాలని సైలెంట్ అయ్యాను” అంటూ అమాయకంగా కవర్ చేస్తారు. అంటే వారు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారన్న విషయాన్ని మీరు మర్చిపోయేలా బ్రెయిన్ వాష్ చేస్తారు. దీనివల్ల బాధితులు తమను తాము అనుమానించుకుంటూ మానసిక గందరగోళానికి లోనవుతారు.

గుర్తించడం ఎలా?

ఒక వ్యక్తి మాటల కంటే వారి చేతలను గమనించడం ముఖ్యం. ఎటువంటి సమాచారం లేకుండా మాయమై, మళ్ళీ వచ్చి సాకులు చెబుతుంటే అది కచ్చితంగా ‘రెడ్ ఫ్లాగ్’ అని గుర్తించాలి. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మీరు ఏమీ ఎరగనట్లు ఉండకూడదు. “నువ్వు మెసేజెస్ ఆపేసినప్పుడు నాకు నీపై ఇంట్రెస్ట్ పోయింది” అని మొహం మీదే సూటిగా చెప్పాలి.

వారు తమ తప్పు ఒప్పుకుంటున్నారా లేక మళ్ళీ మిమ్మల్నే బ్లేమ్ చేస్తున్నారా అనే దానిబట్టి వారి క్యారెక్టర్ బయటపడుతుంది. ఏ రిలేషన్‌షిప్‌లోనైనా నిజాయితీ, క్లారిటీ ఉండాలి. ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడే వ్యక్తులు మీ మానసిక ఆరోగ్యానికి హానికరమని గుర్తించండి. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఇలాంటి టాక్సిక్ బంధాల కంటే ఒంటరిగా ఉండటమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *