గీతూ రాయల్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా, టిక్ టాక్ స్టార్ గా, యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన కామెడీ స్కిట్స్ తో బుల్లితెర ఆడియెన్స్ ను బాగానే నవ్వించింది. ఇదే క్రేజ్ తో 2022లో జరిగిన బిగ్ బాస్ తెలుగు 6లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే తన ఓవరాక్షన్ తో షో మధ్యలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన గీతూ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. తన స్నేహితులతో కలిసి వీడియోలు చేస్తూ మంచి గానే సంపాదిస్తోంది. అయితే ఇటీవల తిరుమల ఆలయంలో గీతూ రాయల్ చేసిన వీడియోలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. . శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లిన ఆమె అక్కడ తన నలుగురు మగ స్నేహితులతో కలిసి అక్కడ రచ్చ చేసింది. పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ముందు నిలబడి ‘ఖడ్గం’ సినిమాలోని ఒక పాటకు రీల్ చేసింది. అలాగే పుష్కరిని, లడ్డు కౌంటర్, ఘాట్ రోడ్ వద్ద రీల్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. వీటిని చూసిన భక్తులు, నెటిజన్లు గీతూ గ్యాంగ్ పై మండిపడ్డారు. అయితే తాజాగా గీతూ రాయల్ పై ఆమె క్లోజ్ ఫ్రెండ్, బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య ఆసక్తికర కామెంట్స్ చేసింది.
బీబీ జోడీతో పాటు పలు టీవీ షోల్లోనూ పార్టిసిపేట్ చేస్తోన్న శ్రీ సత్య ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే సమయంలో గీతూ రాయల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈమధ్య గీతు రాయల్స్‌తో తిరగడం మానేశావా? అని యాంకర్ ప్రశ్నించగా శ్రీ సత్య ఇలా సమాధానమిచ్చింది.. ‘ ఫ్రెండ్స్‌ని మార్చలేదు. కేవలం ఎంజాయ్ మెంట్ ఎక్కువ అవుతుందని అందరికీ దూరంగా ఉంటున్నాను. కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని మిగతా వాళ్లను దూరంగా ఉంచుతున్నాను. గీతుకి ఉన్న నెగటివ్ ఎనర్జీ నాకూ వస్తుందేమో అన్న భయంతో కొంచెం గ్యాప్ తీసుకున్నాను అంతే.. గీతు ఇప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్’ అని ఫుల్ క్లారిటీ గా చెప్పేసింది శ్రీ సత్య.
ఇవి కూడా చదవండి
శ్రీ సత్య లేటెస్ట్ ఫొటోస్..
ప్రస్తుతం గీతూ పట్ల ఈ బిగ్ బాస్ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.