Gas Shortage: గ్యాస్ లేకపోయినా వంట చేసుకోవచ్చు.. ఈ ప్రభుత్వ స్టవ్‌ మీ ఇంట్లో ఉంటే జీవితాంతం ఫ్రీ.. ఇదే మంచి ఛాన్స్..

Gas Shortage: గ్యాస్ లేకపోయినా వంట చేసుకోవచ్చు.. ఈ ప్రభుత్వ స్టవ్‌ మీ ఇంట్లో ఉంటే జీవితాంతం ఫ్రీ.. ఇదే మంచి ఛాన్స్..


Gas Shortage: గ్యాస్ లేకపోయినా వంట చేసుకోవచ్చు.. ఈ ప్రభుత్వ స్టవ్‌ మీ ఇంట్లో ఉంటే జీవితాంతం ఫ్రీ.. ఇదే మంచి ఛాన్స్..

దేశంలో గ్యాస్ కొరత సంక్షోభం తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిగా కేంద్రం నిలిపివేసింది. దీంతో దేశంలోని హోటళ్ల రంగం పూర్తిగా మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీని వల్ల ప్రజలకు ఆహారం పొందటంలో ఇబ్బందులతో పాటు లక్షల మంది ఉపాధికి నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలో గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా వంట ఏర్పాట్ల కోసం ప్రజలు చూస్తున్నారు. అందులో భాగంగా ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్‌లను కొనుగోలు చేస్తుండగా.. గ్యాస్ కొరత కారణంగా వీటి సేల్స్ దేశంలో ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక మరికొన్ని చోట్ల సాంప్రదాయ కట్టెల పొయ్యి పద్దతిని పాటిస్తు్న్నారు. అయితే గ్యాస్ అవసరం లేకుండా మీరు ఉచితంగా వంట వండుకోవచ్చు. అదేంటంటే..?

సోలార్ స్టవ్ అంటే ఏంటి..?

గ్యాస్ అవసరం లేకుండా వంట వండుకోవడానికి మంచి మార్గం సూర్య నూతన్ సోలార్ స్టవ్. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOCL) సూర్య నూతన్ సోలార్ స్టవ్‌ను అభివృద్ది చేసింది. గతంలోనే దీనిని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. సోలార్ ద్వారా పనిచేసే ఈ స్టవ్ మీ ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే గ్యాస్ మీకు ఎప్పటికీ అవసరం ఉండదు. మీ వంట గదిలో సోలార్ ద్వారా మీరు వంట వండుకోవచ్చు. ఈ సోలార్ స్టవ్ హైబ్రిడ్ మోడల్‌లో పనిచేస్తుంది. సోలార్‌తో పాటు కరెంట్ ద్వారా కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. ఈ స్టవ్‌లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి స్టవ్, రెండోది సోలార్ మాడ్యూల్. స్టవ్‌ను కిచెన్‌లో పెట్టుకుంటే. సోలార్‌ను బయట ఎండలో ఉంచుకోవాల్సి ఉంటుంది. సోలార్ శక్తి ద్వారా ఈ స్టవ్ పనిచేస్తూ ఉంటుంది.

ధర ఎంతంటే..?

ఈ సోలార్ స్టవ్‌లో అనేక మోడళ్లలో అందుబాటులో ఉంది. ప్రీమియం మోడల్ స్టవ్‌తో ఒక కుటుంబానికి రోజుకు మూడుపూట్ల భోజనం కుక్ చేసుకోవచ్చు. ప్రీమియం మోడళ్ల ధర రూ.18 నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. సోలార్ ప్యానెల్ జీవితకాలం 20 ఏళ్లు ఉంటే.. స్టవ్ సగటు జీవితకాలం 10 ఏళ్లు ఉంటుంది. ఈ సోలార్ స్టవ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రారంభంలో కొంత ఖర్చు అవుతుంది. ఒకసారి ఏర్పాటు చేసుకుంటే మీకు గ్యాస్ సిలిండర్ డబ్బులు ఆదా అవుతాయి. ప్రతీసారి గ్యాస్ అయినప్పుడు రీఫిల్లింగ్ చేసుకోవాల్సిన బాధ తప్పుతుంది. దేశంలో గ్యాస్ కొరత తీవ్రతరం అవుతున్న క్రమంలో ఈ సోలార్ స్టవ్ గురించి బాగా చర్చ నడుస్తోంది. చాలామందిని దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కూడా చేపిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *