మనం ఎక్కడికైనా షాప్‌కు వెళ్లి, షాపింగ్ మాల్‌కు వెళ్లినా అక్కడ కొనుగోలు చేసే వస్తువులపై మొదటి వాటి ఎక్స్పైరీ డేట్‌ను చూస్తాం. ఒక వేళ అది ఎక్స్పైర్ అయితే దాన్ని కొనుగోలు చేయం. ఎందుకంటే అలాంటి వాటిని కొనుగోలు చేసి యూజ్ చేయడం వల్ల మనం సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.
ఈ వస్తువులకు ఎలాగైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో గ్యాస్ సిలిండర్‌కు కూడా అలానే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్సైరీ అయిన సిలిండర్లను వాడడం చాలా ప్రమాదం. కాబట్టి మీ దగ్గర ఉన్న గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ అయిందా లేదా అనేది తెలసుకోవడం చాలా ముఖ్యం.
గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ డేట్‌ను తెలుసుకునేందుకు మీరు సిలిండర్ పైభాగంలోని గుండ్రటి హ్యాండిల్ వద్ద పరిశీలించండి. అక్కడ ప్లేట్ లోపలి వైపున మీకు ఒక కోడ్ కనిపిస్తుంది. అక్కడ ఇంగ్లీష్ లెటర్ నెలలను, పక్కనున్న నెంబర్ సంవత్సరాన్ని సూచిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఓ అక్షరం చొప్పున 12 నెలలను 4 భాగాలుగా విభజించి, అక్షరాలు కేటాయించారు.
గ్యాస్ సిలిండర్‌పై ఇంగ్లీష్‌లో A అనే అక్షరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలను సూచిస్తుంది. B అనే అక్షరం ఏప్రిల్, మే, జూన్ నెలలను సూచిస్తుంది, C అనే అక్షరం జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలలను సూచిస్తుంది. D అనే అక్షరం అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలను సూచిస్తుంది.
దాన్ని మీరు ఎలా తెలుసుకోవాలంటే మీ దగ్గర ఉన్న సిలిండర్‌పై బీ-13 అని రాసి ఉంటే ఆ సిలిండర్ గడువు 2013వ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో అయిపోయిందని అర్థం. కాబట్టి మీరు సిలిండర్ తీసుకొనే ముందు ఈ కోడ్‌ను బట్టి దాని ఎక్స్పైరీ డేట్‌ను చెక్‌చేసుకోండి.