Gas Cylinder: గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి కేంద్రం లాస్ట్ ఛాన్స్.. ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. డెడ్ లైన్ ఇదే..

Gas Cylinder: గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి కేంద్రం లాస్ట్ ఛాన్స్.. ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. డెడ్ లైన్ ఇదే..


ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో ఒకసారి గ్యాస్ వినియోగదారులు ఆధార్ బేస్డ్ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. 2025-26 ఆర్ధిక సంవత్సరం మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో మార్చి 31లోపు గ్యాస్ వినియోగదారులందరూ ఆధార్ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్ర పెట్రోలియం, సహాజ వాయువు మంత్రిత్వశాఖ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రక్రియ ఎలా చేసుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేసింది. ఈ మేరకు ఎక్స్‌లో ప్రజలకు వివరాలు వెల్లలడించింది. ఈ డీటైల్స్ ఏంటో చూద్దాం.

వీలైనంత త్వరగా పూర్తి చేయండి

“LPG బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ లేదా e-KYC పూర్తి చేయడానికి చివరి తేదీ త్వరలో సమీపిస్తోంది. వినియోగదారులు ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. మీ LPG బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ లేదా e-KYCని పూర్తి చేయడానికి కొత్త, అనుకూలమైన మార్గం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఆధార్ ఫేస్‌ఆర్‌డి యాప్‌తో పాటు మీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్‌ని ఉపయోగించి మీ ఇంటి నుండే ఉచితంగా ప్రక్రియ పూర్తి చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం https:// www.pmuy.gov.in/e-kyc.html లేదా మీ LPG డిస్ట్రిబ్యూటర్‌ను కూడా సంప్రదించవచ్చు.. లేదా టోల్-ఫ్రీ నంబర్‌ 1800 2333 555కు కాల్ చేయవచ్చు” అని కేంద్రం స్పష్టం చేసింది.

ఎలా చేయాలంటే..?

-https:// www.pmuy.gov.in/e-kyc.html లింక్ ఓపెన్ చేయండి
-మీ గ్యాస్ కంపెనీ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి
-ఆధార్ ఫేస్‌ఆర్‌డీ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి
-మీ గ్యాస్ కంపెనీ యాప్‌లోని సూచనల ప్రకారం ఆధార్ ఫేస్‌ఆర్‌డీ యాప్ ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చేసి ఆధార్ ధృవీకరణ పూర్తి చేయండి

గ్యాస్ సబ్సిడీ నగదు కట్

-ఉజ్వల్ యోజన పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లపై రూ.300 సబ్సిడీ పొందుతున్న లబ్దిదారులు ఖచ్చితంగా ప్రతీ ఆర్ధిక సంవత్సరం ఈకేవైసీ చేయించుకోవాలి. లేకపోతే బ్యాంక్ అకౌంట్లో సబ్సిడీ సొమ్ము పడవు
-ఈకేవైసీ పూర్తి చేయకపోయినా ఏడవ రీఫిల్ వరకు సబ్సిడీ కొనసాగుతోంది. ఆ తర్వాత కేవైసీ చేయకపోతే నిధులు నిలిపివేస్తారు
-ఈకేవైసీ చేసుకున్నాక సొమ్ము మళ్లీ జమ అవుతాయి
-ఇప్పటికే ఈకేవైసీ చేసుకుని ఉంటే ఇప్పుడు మళ్లీ చేసుకోవాల్సిన పని లేదు
-ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యేలోపు ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి
-ఉజ్వల్ లబ్దిదారులతో పాటు మిగతా గ్యాస్ వినియోగదారులందరూ ఈ ప్రక్రియ పూర్తి చేయాలి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *