Flipkart Sale: వామ్మో! కోటి రూపాయల టీవీ.. ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌‌లో ఎంతకొస్తుందంటే..

Flipkart Sale: వామ్మో! కోటి రూపాయల టీవీ.. ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌‌లో ఎంతకొస్తుందంటే..


Flipkart Sale: వామ్మో! కోటి రూపాయల టీవీ.. ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌‌లో ఎంతకొస్తుందంటే..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ రకరకాల టీవీలు, మొబైల్స్ పై ఆఫర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సేల్ లో కనిపిస్తున్న ఒక టీవీ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అదే టీసీఎల్ 115 ఇంచెస్ ఎల్ ఈడీ గూగుల్ టీవీ. ఈ టీవీ ఓరిజినల్ ధర రూ. కోటి ఉంది. అయితే ఇది ఫ్లిప్ కార్ట్ ఆఫర్లో రూ. 20 లక్షలకు లభిస్తుంది. వీటితోపాటు కూపన్స్, బ్యాంక్ డిస్కౌంట్స్ వంటివి కలుపుకుంటే రూ.16 లక్షలకు లభిస్తుంది. ఈ టీవీ గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

బిగ్గెస్ట్ ఆఫర్

ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ఉన్న ఆఫర్స్ లో దీన్నే అతిపెద్ద ఆఫర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే  రూ. కోటి ఉన్న టీవీ రూ.16 లక్షలకు లభిస్తుంది. అంటే ఈ టీవీపై సుమారు రూ. 84 లక్షల తగ్గింపు లభిస్తుంది.  అంతేకాదు ఈ టీవీని కొనుగోలు చేసే వారికి రోహిత్ శర్మను కలిసే అవకాశం కూడా ఉంటుందట.

ఫీచర్స్ ఇవే..

టీసీఎల్ 115 ఇంచెస్ గూగుల్ టీవీ.. భారతదేశంలో ఇప్పటివరకూ వచ్చిన అతిపెద్ద టీవీల్లో ఒకటి.  ఇది క్వాంటం ఎల్‌ఈడీ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది 5000 నిట్స్ పీక్స్ బ్రైట్‌నెస్ తో వస్తుంది.  50 మిలియన్ టు 1 కాంట్రాస్ట్ రేషియో  ఉంటుంది.  అంటే ఈ టీవీలో  ఇమేజ్ క్వాలిటీ మామూలుగా ఉండదు. క్రిస్టల్ క్లియర్ గా.. కళ్ల ముందే బొమ్మ కదులుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.2.2 హై-ఫై సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో 12 స్పీకర్లు ఉంటాయి , 240 వాట్స్ పీక్ ఆడియో అవుట్‌పుట్ ఇస్తుంది.డాల్బీ అట్మాస్ సపోర్ట్‌ కూడా ఉంది.

గేమింగ్ కూడా..

ఇకపోతే ఇందులో గేమ్స్ కూడా ఆడుకోవ్చచు. గేమింగ్ కోసం ప్రత్యేకంగా టీసీఎల్ గేమ్ మాస్టర్ టెక్నాలజీ ఉంది. అలాగే ఇది గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్ లాంటి యాప్స్ ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ తో పాటు  గూగుల్ మీట్, గూగుల్ కిడ్స్, మల్టీవ్యూ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.

థియేటర్ ఎక్స్‌పీరియెన్స్

ఇక డిజైన్ విషయానికి వస్తే ఈ టీవీ చాలా స్లిమ్‌గా ఉంటుంది. 16 -బిట్ లైటింగ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. కనెక్టివిటీకి ఇందులో 4 హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్స్, 3 యూఎస్‌బీ పోర్ట్స్, బ్లూటూత్, వైఫై ఉన్నాయి. ఈ టీవీ బరువు సుమారు వంద కిలోలు ఉంటుంది. ఇంట్లో థియేటర్ ఎక్స్ పీరియెన్స్ కోరుకునేవారికి దీనికి మించిన ఆప్షన్ లేదు.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *