దసరా పండక్కి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవాళ్లు ఫ్లిప్ కార్ట్ లో ఉన్న ఈ డిస్కౌంట్ ను మిస్ చేసుకోవద్దు. పాపులర్ ఈవీ కంపెనీ అయిన ఆంపియర్ నుంచి రీసెంట్ గా మాగ్నస్ అనే స్కూటర్ లాంఛ్ అయింది. ఈ స్కూటర్ పై ఇప్పుడు రూ. 20 వేల డిస్కౌంట్ లభిస్తుంది.
ఆఫర్ డీటెయిల్స్
ఆంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ ధర సుమారు రూ. 90 వేల వరకూ ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ సేల్ లో ఇది రూ. 81,999కే లభిస్తోంది. ఒకవేళ మీరు ఐసీఐసీఐ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.11 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూ. 70 వేలకి సొంతం చేసుకోవచ్చు. ఒకవేల మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోతే యూపీఐ పేమెంట్ ద్వారా కనీసం రూ.7 వేల వరకూ మరొక డిస్కౌంట్ పొందొచ్చు. ఎలా చూసుకున్నా ఇది మాత్రం మంచి ఆఫర్ అనే చెప్పాలి. ఫ్లిప్ కార్ట్ లో ఉన్న ఐఫోన్, శాంసంగ్, వివో వంటి ప్రీమియం ఫోన్స్ ధరల కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది.
ఫీచర్స్
ఇక ఈవీ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 2.5 కిలో వాట్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్లు వరకూ వెళ్తుంది. టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి సుమారు 5 గంటలు పడుతుంది. 3.5 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ఐపీ 67 వాటర్ ప్రూఫ్ రేటింగ్ ఉంటుంది. యూఎస్ బీ ఛార్జింగ్ పోర్ట్, ఎల్ ఈడీ హెడ్ లైట్స్ ఉంటాయి. 22 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్కూటర్ ఐదు సంవత్సరాలు లేదా 75 వేల కిలోమీటర్ల వారంటీతో వస్తుంది. బ్యాటరీకి మూడేళ్లు లేదా 30 వేల కిలోమీటర్ల వారంటీ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి