Financial Goal: మీ ఫైనాన్షియల్ గోల్ ఏంటి? దాన్ని రీచ్ అయ్యేందుకు ఇలా చేస్తున్నారా? లేదా?

Financial Goal: మీ ఫైనాన్షియల్ గోల్ ఏంటి? దాన్ని రీచ్ అయ్యేందుకు ఇలా చేస్తున్నారా? లేదా?


పెళ్లి, సొంత ఇల్లు, కారు.. ఇలా చాలామందికి చాలారకాల అవసరాలు కోరికలు ఉంటాయి. వీటికి కావల్సిన డబ్బుని అనుకున్న టైంలో సంపాదించాలంటే దానికి సరైన ప్లానింగ్ అవసరం. మరి అది ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం.

షార్ట్‌కట్స్ వద్దు

త్వరగా డబ్బు సంపాదించాలనే కోరికతో కొంతమంది షార్ట్ కట్ దారులు వెతుకుంటారు. ఇలాంటి దారుల వల్ల మరింత ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు సంపాదించడం కోసం మీకున్న స్కిల్స్‌పై మాత్రమే ఆధారపడాలి అనేది నిపుణుల సూచన. డబ్బు సంపాదించడానికి ఉద్యోగం, వ్యాపారం వంటివి మాత్రమే ప్రధానమైన దారులుగా ఎంచుకోవాలి. ఇక వస్తున్న డబ్బుని రెట్టింపు చేయడం కోసం సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి ఆప్షన్స్ ఎంచుకోవాలి.

మీ డబ్బుని మీరే..

వీలైనంత త్వరగా ఫైనాన్షియల్ గోల్ రీచ్ అవ్వాలంటే ఖర్చులు తగ్గించడం కూడా నేర్చుకోవాలి. ఖర్చుల్ని వీలైనంత తగ్గించుకుని మిగిలిన డబ్బుని సేఫ్ ఆప్షన్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ లేదా సేవింగ్స్ చేయాలి. డబ్బుని నిర్వహించే పనిని వేరొకరిపై పెట్టకూడదనేది నిపుణుల సలహా. ఎవరి డబ్బుని వారే ఖర్చు చేస్తుంటే దానిపై వారికి పూర్తి కంట్రోల్ ఉంటుంది. అయితే పెట్టుబడులు, సేవింగ్స్ వంటి విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

సెకండ్ ఇన్‌కమ్

ఫైనాన్షియల్ గోల్‌ని త్వరగా రీచ్ అవ్వాలంటే రెండో ఇన్‌కమ్ సోర్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఖాళీ సమయాల్లో ఏదైనా స్కిల్ లేదా ఆర్ట్ వంటివి నేర్చుకుని పార్ట్ టైం జాబ్ లేదా ఫ్రీలాన్స్ జాబ్స్ వంటివి చేయొచ్చు. ట్యూషన్స్ చెప్పడం, క్రాఫ్ట్స్ చేసి అమ్మడం, దుస్తులు డిజైన్  చేయడం వంటివి.

ఓపికగా..

ఇక చివరిగా ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడు దానికి తగినంత సమయం ఇవ్వాలి. మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్వెస్ట్‌మెంట్స్ అయినా ఇతర పెట్టుబడులు అయినా ఐదు నుంచి పదేళ్ల వ్యవధిలో మాత్రమే మంచి రిటర్న్స్ ఇస్తాయి అన్న విషయం గుర్తుంచుకోవాలి. తక్కువ సమయంలో డబ్బు సమకూరడం అంత ఈజీ కాదు. కాబట్టి కొంత టైం పెట్టుకుని అప్పటివరకూ ఓపికతో వెయిట్ చేయాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *