ఎలక్ట్రిక్ స్కూటర్, బైక్స్ కొనాలనుకునే వారికి ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా గుడ్ న్యూస్ చెప్పింది. తమ వినియోగదారుల కోసం ఓలా.. ఓలా సెలబ్రేట్స్ ఇండియా అనే సరికొత్త ఫెస్టివల్ ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద ఓలా తమ ఉత్పత్తులపై భారీ డిస్కైంట్స్ ఇవ్వనుంది. ముహూర్త మహోత్సవ్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్స్ అక్టోబర్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఆఫర్‌లో ఎంపిక చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభం ధర రూ.49,999గా ఉండనున్నట్టు తెలుస్తోంది.
ఓలా ఫెస్టివల్ ఆఫర్ పూర్తి వివరాలు..
ఈ ఆఫర్ కింద రూ. 81,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన 2 kWh మోడల్ Ola S1X ను కేవలం రూ. 49,999 కు కొనుగోలు చేయవచ్చు
అలాగే రూ. 99,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన 2.5 kWh వేరియంట్ Ola Roadster X ను కేవలం రూ. 49,999 కు కొనుగోలు చేయవచ్చు
ఓలా S1 ప్రో+ (5.2 kWh), రోడ్‌స్టర్ X+ (9.1 kWh) మోడల్స్ కూడా ఇప్పుడు రూ. 99,999 ధరకు రానున్నాయి. ఈ రెండూ టాప్-స్పెక్ మోడల్స్ తో వస్తున్న వాహనాలు, వీటిలో 4,680 బ్యాటరీ ఉంటుంది. లాంచింగ్ సమయంలో ఈ రెండు వాహనాల ప్రారంభ ధరలు వరుసగా.. రూ. 1,69,999, రూ. 1,89,999గా ఉన్నాయి. ఇప్పుడు పండగా ఆఫర్ కింద ఇవి కేవలం రూ.99,999కు రానున్నాయి.
నోట్: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్‌లో నుంచి సేకరించిన వివరాల మేరకు అందించడం జరిగింది. వీటిపై మరిన్ని ఆఫర్స్ తెలసుకునేందుకు మీ సమీపంలోని ఓలా షో రూమ్‌ను సంప్రదించండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.